
*అభివృద్దే మా అజెండా -మంత్రి నారాయణ*
అభివృద్దే తన అజెండా అని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు .జూన్ పన్నెండుకల్లా సిటీ లో చేపట్టిన అభివృద్ధిపనులు పూర్తి చేస్తామన్నారు .గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలనతో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను అనుభవంతో సీఎం చంద్రబాబు నాయుడు సరిచేస్తున్నారన్నారు .
నెల్లూరు నగర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గురువారం మంత్రి నారాయణ చేపట్టిన పర్యటన అత్యంత ఉత్సాహంగా సాగింది. సీఆర్పీ డొంకలో నారాయణ నేత్రజ్యోతి – దంత సురక్ష’ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన మంత్రి, అక్కడ కంటి పరీక్షలు చేయించుకున్న 12 మందికి అద్దాలను పంపిణీ చేశారు, రాబోయే రెండేళ్లలో 48 వేల మందికి కంటి పరీక్షలు చేయడమే తమ లక్ష్యమన్నారు. అనంతరం సిటీ నియోజకవర్గంలో కొనసాగుతున్న పార్కుల జాతర’లో భాగంగా 8వ డివిజన్లో 85 లక్షలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పొట్టిశ్రీరాములు పార్కును ప్రారంభించారు.ఈ సందర్భంగా పార్కులో జిమ్ చేసి అందరినీ ఉత్సాహపరచడమే కాకుండా, చిన్నారులతో ఆటలాడించి ,వారికి చాక్లెట్లు పంపిణీ చేసి పండగ వాతావరణం నింపారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు ., తమ ప్రభుత్వం అభివృద్ధి – సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతుందని, నెల్లూరు కార్పొరేషన్ అభివృద్ధికి 850 కోట్ల నిధులు కేటాయించామని స్పష్టం చేశారు. నగరంలో 50 వేల చెట్లు నాటి గ్రీన్ సిటీగా మార్చడమే కాకుండా, త్వరలోనే భారీ అడ్వెంచర్ పార్క్, వాటర్ స్పోర్ట్స్ పార్క్ ఏర్పాటు చేస్తామని, 15 ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామన్నారు. మార్కాపురం బస్సు ప్రమాద ఘటన బాధాకరమన్నారు .మృతులకు
5 లక్షల పరిహారాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారన్నారు . గాయపడ్డ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.అనంతరం సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్ ,మేయర్ సుజాత అశోక్ ,మాజీ మున్సిపల్ చైర్పెర్సన్ తాళ్ళపాక అనురాధ,మాజీ జెడ్పిటీసీ విజేతా రెడ్డి ,టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి ,సిటీ మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి,డివిజన్ కో క్లస్టర్ హేమంత్ కుమార్ ,ప్రెసిడెంట్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు .