*నెల్లూరులో పేదల ముంగిటకే వైద్యం.విజయవంతంగా
‘నారాయణ నేత్ర జ్యోతి’*

*మంత్రి నారాయణ సంకల్పం.. నిరుపేదలకు ఉచిత వైద్యం*

15వ డివిజన్‌లో అట్టహాసంగా ఉచిత వైద్య శిబిరాలు

వేలాది మంది కళ్లల్లో వెలుగులు నింపిన ‘నేత్ర జ్యోతి’

ఇంటి వద్దకే వైద్యం.. పేదలకు అండగా నిలుస్తున్న మంత్రి నారాయణ

నెల్లూరు నగరంలోని 15వ డివిజన్‌లో నారాయణ నేత్ర జ్యోతి మరియు నారాయణ దంత సురక్ష కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయి . రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ ఆదేశాల మేరకు, ప్రతి డివిజన్‌లోని నిరుపేదలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ మహోద్యమం కొనసాగుతోంది.
ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన ఈ శిబిరాల్లో ఇప్పటివరకు 1600 మందికి పైగా ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకోగా, వారిలో 890 మందికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. అంతేకాకుండా, దృష్టి లోపంతో బాధపడుతున్న 25 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించి వారికి కంటిచూపు ను ప్రసాదించారు. పేద ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, వారి ఇంటి వద్దకే వైద్య సేవలు తీసుకురావాలన్న మంత్రి సంకల్పం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ సుధా,ప్రశాంత్..15వ డివిజన్ కార్పొరేటర్ గణేష్ సుజాత వెంకటేశ్వర రెడ్డి,డివిజన్ అధ్యక్షుడు కేపీ చౌదరి, క్లస్టర్ ఇంచార్జి అంచురి శ్రీనివాసులు నాయుడు.. యూనిట్ ఇన్ఛార్జ్ లు ప్రసాద్ రావు, పరశురాం, వెంకటరమణ..బూత్ కన్వీనర్లు.. స్థానిక టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *