*మాట తప్పని మంత్రి: కాపు భవన్ ఆధునీకరణకు మరో కోటి రూపాయల సొంత నిధులు.*

*కలెక్టర్ కి కోటి రూపాయల చెక్కును అందించిన అల్లుడు పునీత్*

*జూలై నాటికి కాపు భవన్ సిద్ధం – జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కీలక ప్రకటన.*

కాపులకిచ్చిన మాటను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు మంత్రి నారాయణ నిలబెట్టుకున్నారు .కాపు భవన్ ఆధునీకరణకు కోటి రూపాయల విరాళం ఇచ్చారు .చెక్కును మంత్రి అల్లుడు పునీత్ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అందచేశారు .రెండు విడతల్లో రెండు కోట్లు ఇచ్చిన మంత్రికి కాపు భవన్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు .

సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్న మంత్రి నారాయణ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కాపు భవన్ ఆధునీకరణ కోసం ఇచ్చిన మాట ప్రకారం తన సొంత నిధుల నుండి రెండవ విడతగా రూ. 1 కోటి విరాళాన్ని ప్రకటించారు.మంగళవారం
మంత్రి అల్లుడు పునీత్ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి కోటి రూపాయల చెక్కును అందజేశారు. గతంలోనే కాపు భవన్ అభివృద్ధి కోసం కోటి రూపాయల సొంత నిధులు ఇచ్చిన మంత్రి, ఇప్పుడు మళ్ళీ కోటి రూపాయలు కేటాయించడంపై కాపులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ మంత్రి నారాయణ అందించిన ఈ నిధులతో వచ్చే జులై నాటికే కాపు భవన్ ఆధునీకరణ పనులన్నీ పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. తమ అభ్యర్థనను మన్నించి, ఇచ్చిన మాట ప్రకారం మొత్తం రూ. 2 కోట్లు కేటాయించినందుకు కాపు భవన్ కమిటీ సభ్యులు మంత్రి నారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు..కలెక్టర్ హిమాన్షు శుక్లా,మంత్రి అల్లుడు పునీత్‌లను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కాపుఫ్ భవన్ నాయకులు గాదిరాజు అశోక్ ,పోతరాజు శ్రీనివాస్, అనిల్ కుమార్,​గునుకుల కిషోర్ ,​భూపతి విజయ కుమార్,​పసుపర్తి కిషోర్ కుమార్,​శంఖవరపు శ్రీహరి,​సూరిశెట్టి గాయత్రి,వనమాల గోవింద రావు,​పులి శ్రీనివాసులు ,మాజీ జెడ్పిటీసీ విజేతా రెడ్డి ,ఉస్మాన్ సాహెబ్ పేట రామాలయ ఛైర్మెన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed