*నెల్లూరు నగరంలో మొండి బకాయి దారుల నుంచి పన్నులు వసూలు చేసిన కమిషనర్ వై.ఓ నందన్*

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ మొండి బకాయి దారుల నుంచి పన్నులు వసూలు చేసేందుకు స్వయంగా మంగళవారం బకాయిదారులను కలుసుకొని పన్నుల వసూళ్లను చేపట్టారు.

లెక్చరర్స్ కాలనీకి సంబంధించి ఆస్తిపన్ను మొండి బకాయి వసూలు కోసం దాని యజమానిని స్థానిక ఎస్2 థియేటర్ ప్రాంతంలోని లక్ష్మీ స్కాన్ సెంటర్ లో కమిషనర్ కలుసుకుని గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బకాయిని చెల్లించాలని కోరారు.

స్పందించిన ఆస్తి యజమాని బకాయిగా ఉన్న రూ 8,77,827/- లను చెల్లించారు.

నగరాభివృద్ధికి ప్రతి ఒక్కరు బాధ్యతగా పన్నులను చెల్లించి సహకరించాలని ఈ సందర్భంగా కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్చార్జి సిటీ ప్లానర్ రఘునాధరావు,రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవి, వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed