
*రోడ్డు మార్జిన్ దాటి విక్రయాలు జరిపే వారిని గుర్తించి జరిమానాలు విధిస్తామని హెచ్చరించాలని సూచించిన కమిషనర్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 46వ డివిజన్ చిన్న బజారు ప్రాంతంలో అధికారులతో కలిసి మంగళవారం పర్యటించారు.
ఫ్రూట్ మార్కెట్, కూరగాయల మార్కెట్ ప్రాంతంలో తొలగించిన ఆక్రమణలను పరిశీలించారు. నిర్దేశించిన రోడ్డు మార్జిన్ దాటి పండ్ల బుట్టలు, తోపుడు బండ్లు తదితర వాటిని ఉంచకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు మార్జిన్ దాటి విక్రయాలు జరిపే వారిని గుర్తించి జరిమానాలు విధిస్తామని హెచ్చరించాలని సూచించారు.
అదేవిధంగా బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై వ్యర్ధాలు వేయకుండా ప్రతి ఒక్కరు తమ ప్రాంగణంలో డస్ట్ బిన్ ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ సూచించారు.
అనంతరం కూరగాయల మార్కెట్ సమీపంలోని అధ్యక్షం వారి వీధిలో తొలగించిన ఆర్.ఓ ప్లాంట్ ప్రాంతాన్ని కమిషనర్ స్థానిక కార్పొరేటర్ వేలూరు మహేష్ తో కలసి సందర్శించారు.
స్థానిక తడికల బజార్ ప్రాంతంలోని ఆర్ ఎస్ ఆర్ పాఠశాల పరిసర ప్రాంతాలలోని రోడ్డు ఆక్రమణలను కమిషనర్ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్చార్జి సిటీ ప్లానర్ రఘునాధరావు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగం, రెవిన్యూ, అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.