
*అబద్ధాలకు కేరాఫ్ వైసీపీ*
*గంటల తరబడి సాగే జగన్ రెడ్డి ప్రెస్ మీట్లలో ఒక్క నిజం చెబితే ఒట్టు*
*సొంత తల్లి, చెల్లిపైనా బ్లూ మీడియాలో పేజీలకు పేజీలు వ్యతిరేక రాతలు*
*కూటమి ప్రభుత్వ పాలనలో చరిత్రలో నిలిచిపోయేలా అభివద్ధి, సంక్షేమం*
*ప్రజలకు జరుగుతున్న మంచిని వివరించండంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలి*
*టీడీపీ శ్రేణులకు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపు*
*తిరుపతిలో పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు నూతన పార్లమెంట్ కమిటీ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సోమిరెడ్డి*
*మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్*
తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి బాధ్యతలు చేపట్టడం సంతోషదాయకం
ఆమె గతంలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యురాలిగా శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు
ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన యువ నాయకుడు డాలర్స్ దివాకర్ రెడ్డి తుడా చైర్మన్ గానూ సేవలందిస్తున్నారు
రెండు నెలల్లో కార్యాలయాన్ని అన్ని వసతులతో అద్భుతంగా తీర్చిదిద్దిన దివాకర్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు
తిరుపతి – తిరుమల అంటే ప్రపంచంలోనే అతి పెద్ద పుణ్యక్షేత్రం
శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రమున్న తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పార్టీ కమిటీకి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడమే అదృష్టం
తిరుపతి పార్లమెంటుకు ప్రత్యేక గుర్తింపు ఉంది..ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు ఉండగా దుగరాజపట్నంలోనూ పోర్టు రాబోతోంది
శ్రీసిటీ, క్రిస్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, షార్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులన్నీ తిరుపతి పరిధిలోనే ఉండటం గొప్ప విషయం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేసిన క్రిస్ సిటీ పనులు వేలాది ఎకరాల్లో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి
ఈ రోజే అనకాపల్లిలో ఉక్కు ఫ్యాక్జరీకి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తుండటం శుభపరిణామం
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది
ఏపీలో అమలవుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం దేశంలోనే ఒక చరిత్ర
దేశంలోని ఏడు పెద్ద రాష్ట్రాలు కలసి పింఛన్ల కోసం నెలకు రూ.2754 కోట్లు ఖర్చు చేస్తుంటే, ఒక్క ఏపీలో నెలకు రూ. 2725 ఖర్చుపెడుతున్నాం
గంటల తరబడి సాగుతున్న జగనన్న ప్రెస్ మీట్లలో ఒక్క వాస్తవం ఉండదు
కూటమి ప్రభుత్వం పింఛన్ల కోసం ఏడాదికి రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తోంది..వైసీపీ పాలనలో అన్ని పథకాలు కలిపినా ఆ మొత్తాన్ని దాటలేదు
కూటమి ప్రభుత్వం ఒక్క పింఛన్లే కాకుండా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, దీపం-2 వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తోంది
తల్లికి వందనం పథకంతో ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అందరికీ ప్రయోజనం కలిగిస్తున్నాం
అన్నదాత సుఖీభవ పథకంలో కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.14 వేలు రైతులకు అందిస్తున్నాం
స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి పథకాలతో మహిళలు, దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు
మత్స్యకారుల వేట విరామ భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచాం
ఈ పథకాలన్నింటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మన నాయకులు, కార్యకర్తలపై ఉంది
వైసీపీ నేతలు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు…సొంత పత్రికలో ఇష్టమొచ్చిన రాతలు రాస్తున్నారు
జగన్ రెడ్డి సొంత తల్లిపై ఓ వైసీపీ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే సాక్షిలో పేజీలకు పేజీలు రాయించారు
కన్న తల్లికి జరిగిన అవమానంపై లోకేష్ బాబు రోడ్డెక్కి యువగళం పాదయాత్ర చేపట్టి రాష్ట్రమంతా ఒక ఊపు తెచ్చి తన తండ్రిని సీఎం సీటులో కూర్చోపెట్టే వరకు విశ్రమించలేదు
జగన్మోహన్ రెడ్డి మాత్రం తన సొంత చెల్లి, తల్లిపైనే సాక్షి పత్రికలో ఇష్టమొచ్చినట్టు రాతలు రాయిస్తున్నాడు
వైసీపీ అడ్డగోలు ప్రచారాలపై ప్రతి టీడీపీ నాయకుడూ దీటుగా స్పందించాలి
చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబును విమర్శించే వారిని గట్టిగా ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలతో పాటు సోషల్ మీడియాను కూడా సద్వినియోగం చేసుకోవాలి