*ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా కూటమి పాలన*

*అభివృద్ధి, సంక్షేమం చూసే టీడీపీ వైపు వైసీపీ శ్రేణుల చూపు*

*వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళేనికి చెందిన 37 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరిక*

*నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ కండువాలు కప్పి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

*ఈపూరు మురళీరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వారిలో అద్దంకి వెంకట రమణయ్య, బండి గోవిందు, అద్దంకి శ్రీనివాసులు, అద్దంకి కృష్ణయ్య, వెంపులూరు వెంకట శేషయ్య, అలపాక మస్తానయ్య, అద్దంకి చిన్న చెంగయ్య, కఠారి ఏడుకొండలు, ముడి కొండయ్య తదితరులు…*

*సోమిరెడ్డి కామెంట్స్*

కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి టీడీపీలో చేరుతున్న వారికి ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాం

నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నాం

రెండేళ్ల పాలనలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం

వైసీపీ పాలనలో పనులు చేయకుండానే బిల్లులు చేసుకుని ఇరిగేషన్ వ్యవస్థను భ్రష్టుపట్టించారు

ఇప్పుడు ప్రతి పనిని రైతుల భాగస్వామ్యంలో పారదర్శకంగా చేసి కాలువలకు పూర్వ వైభవం తెస్తున్నాం

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నాం

చరిత్రలో నిలిచిపోయేలా సంక్షేమ పథకాల అమలు జరుగుతోంది

గత ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గం భూకుంభకోణాలకు నెలవుగా మారింది

మా ప్రభుత్వం వచ్చాక భూఅక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రయత్నిస్తున్నాం

రామదాసుకండ్రిగ, కొమ్మలపూడి, మరుపూరు, సూరాయపాళెం తదితర గ్రామాల్లో కోట్ల విలువ చూసే భూములను బినామీ పేర్లతో కొల్లగొట్టారు

ఆ భూములను కాపాడే ప్రయత్నం చేస్తుంటే కోర్టు స్టేలతో అడ్డుతగులుతున్నారు

అన్నింటిని అధిగమించి ప్రభుత్వ భూములను కాపాడి నిరుపేదలకు చెందేలా కృషి చేస్తున్నాం

మేం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పొరపాట్లు చేయం..ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేస్తే ఉపేక్షించబోం

ఈ రోజు టీడీపీలో చేరిన వారిని పాత కార్యకర్తలతో సమానంగా చూసుకుంటాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *