
*శిక్షణను సద్వినియోగం చేసుకొని గృహ గణన 2027 కార్యక్రమంలో పాల్గొనాలని సూచించిన కమిషనర్ వై.ఓ. నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం లో భారత దేశ జనాభా గణన – 2027 శిక్షణ తరగతులను సోమవారం నిర్వహించారు.
మూడు రోజులపాటు నిర్వహించనున్న శిక్షణలో తొలిరోజు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పాల్గొని మాట్లాడారు.
మే నెల 1వ తేదీ నుంచి 30 వరకు గృహ గణన 2027 నిర్వహణ కోసం గణాంక కార్యకలాపాలలో భాగస్వాములుతున్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ఇతర కార్యనిర్వాకులందరికీ కమిషనర్ అభినందనలు తెలియజేశారు.
మాస్టర్ ట్రైనర్స్ మాల్యాద్రి, కోటేశ్వరరావు ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జనాభా గణనకు సంభందించిన వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు.
భారతదేశంలో డిజిటల్ సాధనాల ద్వారా డేటా సేకరించబోతున్న మొట్టమొదటి గృహ గణన కావడంతో ఇది ఎంతో విశిష్టమైనదని కమిషనర్ తెలియజేశారు.
ఎన్యూమరేటర్లు తమ స్వంత స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి కుటుంబాల నుంచి డేటాను సేకరించాలని, అదనంగా కుటుంబాలు స్వయంగా వివరాలను నమోదు చేసుకునేలా ప్రత్యేక వెబ్ పోర్టల్ ద్వారా స్వీయ గణన చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారని కమిషనర్ తెలియజేశారు.
శిక్షణను సద్వినియోగం చేసుకొని గృహ గణన 2027 కార్యక్రమంలో పాల్గొనాలని కమిషనర్ సూచించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో సిటీ ప్లానర్ ఇంచార్జ్ రఘునాధరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సతీష్, సెన్సస్ పర్యవేక్షకుడు రాజేంద్రప్రసాద్, ట్రైనర్స్, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.