నెల్లూరులో ఘనంగా రంజాన్ వేడుకలు

బారాషాహీద్ ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసిన మంత్రి నారాయణ

9.8 కోట్లతో బారాషహీద్ దర్గా అభివృద్ధి

మైనారిటీల కోసం 20 కోట్లతో ఇంటర్నేషనల్ స్కూల్

దేశంలోనే నెల్లూరును రోల్ మోడల్‌గా నిలుపుతాను – ధీమా వ్యక్తం చేసిన మంత్రి నారాయణ.

మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు .విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

నెల్లూరులో రంజాన్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. బారాషహీద్ దర్గా ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి నారాయణ పాల్గొని, ముస్లిం సోదరులను ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆగిపోయిన దర్గా అభివృద్ధి పనులను 9.8 కోట్ల రూపాయలతో పునఃప్రారంభిస్తామన్నారు .దర్గా అభివృద్ధి కి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు . మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు కోసం వక్ఫ్ బోర్డు స్థలంలో 20 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్కూల్‌ను, స్విమ్మింగ్ పూల్‌ను నిర్మిస్తున్నామని, దీని డిజైన్ బాధ్యతలను తన కుమార్తె షరణికి అప్పగించానని వెల్లడించారు.42 వ డివిజన్ లో షాధీమంజిల్ ని తమ హయాం లోనే ప్రారభించామన్నారు 54 డివిజన్లలోని షాదీ మంజిల్ నిర్మాణానికి తన సొంత నిధులతో పాటు ఎంపీ వేమిరెడ్డి నిధులను కూడా వెచ్చించి త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమామ్, మౌజాంల కోసం 40 కోట్ల రూపాయలను మంజూరు చేశారని తెలిపారు .దేశంలోనే నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ,రూరల్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి లు మాట్లాడుతూ విద్యకు దర్గా అభివృద్ధికి మంత్రి నారాయణ అందిస్తున్న తోడ్పాటును కొనియాడారు.పేదరికం పోవాలంటే విద్యే ఆస్తి అని నమ్మిన మంత్రి సంకల్పం పేదపిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తోందన్నారు .

ఈ కార్యక్రమంలో మేయర్ సుజాతా అశోక్ ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,కార్పొరేటర్ ,
కరిముల్లా మైనారిటీ నేతలు సమ్మీ,షంషుద్దీన్ ,
ఇంతియాజ్ ,టీడీపీ ముఖ్యనేతలు తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *