*వికలాంగులైన పిల్లల కోసం కేటాయించిన ” వియాన్ హోమ్” భూమిలో అనధికారిక కట్టడాల గురించి దర్యాప్తు చేసి నిజానిజాలు వెల్లడించండి : V. మల్లికార్జున*

గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి,

SPSR నెల్లూరు.

విషయం: వికలాంగులైన పిల్లల కోసం కేటాయించిన ” వియాన్ హోమ్” భూమిలో అనధికారిక కట్టడాల గురించి పిర్యాదు.

అయ్యా,

నేను ఈ ద్వారా SPSR నెల్లూరు, వెంగళరావ్ నగర్‌లోని హోలీ క్రాస్ కాన్వెంట్ వియాని హోమ్ (శారీరక వికలాంగులైన పిల్లల నివాసం) కోసం ప్రభుత్వం కేటాయించిన భూమికి సంబంధించిన ఒక ముఖ్యమైన లేఖ మీ దృష్టికి తీసుకువస్తున్నాను.  ప్రభుత్వం ఈ భూమిని వికలాంగులైన పిల్లల సంక్షేమం మరియు వారి పునరావాసం కోసం కేటాయించింది.  అయితే, ప్రస్తుతం కొంతమంది వ్యక్తులు ఆ స్థలంలో మతపరమైన కన్వెన్షన్ హాల్ మరియు చర్చిని నిర్మించారు మరియు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు.  అటువంటి సేవా కార్యక్రమాలలో ఇటువంటి అనధికారిక మతపరమైన కట్టడాలు నిర్మించవచ్చా!.  ఈ నిర్మాణాలకు ప్రభుత్వ శాఖల నుండి సరైన అనుమతులు ఉన్నాయా లేదా అనేది సందేహాస్పదంగా ఉంది.  ఇది భూమి కేటాయింపు నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది.  ప్రస్తుతం ఈ వియాని హోమ్‌లో ఎంత మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారో తెలియపరచగలరని కోరుతున్నాను.  ఇటువంటి కలుగ మతపరమైన అనధికారిక కట్టడాల వల్ల ఆ పిల్లలకు కేటాయించిన స్థలం తగ్గిపోవడమే కాకుండా, వారి వనరులకు ఆటంకం కలిగిస్తోంది.

కావున, తమరిని నేను కోరుతున్న విన్నపం ఏమిటంటే:

ఈ భూమికి సంబంధించిన అసలు కేటాయింపు పత్రాలను మరియు భూ-వినియోగ (Land-use) నిబంధనలను పరిశిలించండి.

* అక్కడ నిర్మించిన అనధికారిక మత పరమైన కన్వెన్షన్ హాల్ మరియు చర్చికి అనుమతులు ఉన్నాయో లేదో విచారణ జరిగిపించవలసింది గా కోరుచున్నాను.

నిబంధనల ఉల్లంఘన జరిగినట్లయితే, ఆ భూమిని తిరిగి వికలాంగులైన పిల్లల సంక్షేమం కోసమే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు/ఫొటోలు ఈ లేఖతో జత చేస్తున్నాను. వికలాంగులైన పిల్లల ప్రయోజనాలను కాపాడతారని ఆశిస్తున్నాను.

ధన్యవాదములు,

తమ భవదీయుడు,

V. మల్లిఖార్జున 8099995456

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *