
*ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి : కండే కోటేశ్వరరావు, సిపిఎం రూరల్ కార్యదర్శి*
జన హుషార్ (నెల్లూరు) ఫిబ్రవరి.02 : నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 30వ డివిజన్ కొత్తూరు శాఖ** *ఆధ్వర్యంలో వైయస్సార్ నగర్ సచివాలయం వద్ద మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్దించాలని*, , *పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని, మరియు రద్దు చేసిన కార్మిక చట్టాలను తిరిగి పునరుద్దించాలని కోరుతూ ప్రజల చేత సంతకాలు చేయించి వైయస్సార్ నగర్ సచివాలయం అడ్మిన్ (కార్యదర్శి) గారికి అర్జీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి కండె కోటేశ్వరరావు శాఖ సభ్యులు Sd హమీద్, వెంకట రమణయ్య, దయాకర్ తదితరులు పాల్గొన్నారు*.