
SPS నెల్లూరు జిల్లా,
తేదీ.24.01.2026.
*ఇంటి మోటార్ సైకిళ్ళ దొంగతనాల కేసులలో ముద్దాయి ఆటకట్టించిన నెల్లూరు వేదాయపాలెం పోలీసులు*
చాక చక్యంగా వ్యవహరించి కేసును చేధించిన నెల్లూరు వేదాయపాలెం పోలీసులను మరియు నెల్లూరు టౌన్ ASP గారిని అభినందించిన జిల్లా యస్. పి*
చెడు వ్యసనాలకు బానిసై నగదు కోసం దొంగతనమే అలవాటుగా జీవిస్తున్న ముద్దాయి..
కూపి లాగి 17 మోటారు సైకల్ దొంగతనం కేసులు చేధించిన నెల్లూరు వేదాయపాలెం పోలీసులు..
ముద్దాయి అరెస్ట్, సుమారు రూ.8,50,000 ల విలువ గల 17-మోటార్ బైకులు స్వాధీనము.
వేదాయపాలెం, చిన్న బజార్, సంతపేట, దర్గామిట్ట, బాలాజినగర్, నాయుడుపేట మరియు తడ
పోలీసు స్టేషన్ లిమిట్స్ లలో మోటార్ బైక్ లు లక్ష్యంగా చోరీలు చేస్తున్న ముద్దాయి..
ముద్దాయిపై గతంలో సుమారు పలు మోటార్ బైక్ కేసులు వుండి జైలుకు పోయి వచ్చి మరల గత కొంత కాలంగా దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడి.
నెల్లూరు టౌన్ ASP గారి పర్యవేక్షణలో ముద్దాయిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన నెల్లూరు వేదాయపాలెం పోలీసులు.
చాక చక్యంగా వ్యవహరించి కేసును చేధించిన నెల్లూరు వేదాయపాలెం పోలీసులను మరియు నెల్లూరు టౌన్ ASP గారిని అభినందించిన జిల్లా యస్. పి. గారు.
కేసుల వివరాలు:
1) వేదాయపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో 4 మోటార్ సైకల్ దొంగతనాలు.
2) చిన్న బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో 5 మోటార్ సైకల్ దొంగతనాలు.
3) దర్గామిట్ట పోలీసు స్టేషన్ పరిధిలో 4 మోటార్ సైకల్ దొంగతనాలు.
4) సంతపేట పోలీసు స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకల్ దొంగతనాలు.
5) బాలాజి నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకల్ దొంగతనాలు.
6) నాయుడుపేట పోలీసు స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకల్ దొంగతనాలు.
7) తడ పోలీసు స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకల్ దొంగతనాలు.
ముద్దాయి వివరాలు:
కల్లూరు శ్రావణ్ కుమార్ s/o కే.సిద్ధయ్య, వయసు 38 సంవత్సరాలు, కులం-ఎస్సీ/మాల, స్వస్థలం సిరసనం బేడు గ్రామం, పెళ్లకూరు మండలం, తిరుపతి జిల్లా.
స్వాధీనం సొత్తు: సుమారు రూ.8,50,000 ల విలువ గల 17-మోటార్ బైకులు.
దర్యాప్తు: నెల్లూరు జిల్లా పరిధిలో ఇటీవలి కాలంలో ఎక్కువ అయిన మోటార్ సైకల్ దొంగతనాలు అరికట్టాలనే గౌరవ జిల్లా యస్.పి. డా.అజిత వెజెండ్ల, IPS., గారి ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి. (అడ్మిన్) శ్రీమతి CH.సౌజన్య గారి సూచనల మేరకు నెల్లూరు టౌన్ ASP శ్రీమతి దీక్ష,IPS., గారి పర్యవేక్షణలో నెల్లూరు వేదాయపాలెం ఇన్స్పెక్టర్ శ్రీ K. శ్రీనివాసరావు, SI U. సాయి కళ్యాణ్ మరియు సిబ్బంది కలసి ముద్దాయిని అదుపులోకి తీసుకొని, సుమారు రూ.8,50,000 ల విలువ గల 17-మోటార్ బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ముద్దాయిని పట్టుకొని చోరి సొత్తును స్వాధీన పరచుకోవడంలో ప్రతిభ కనపరచిన అధికారులను మరియు సిబ్బందిని నెల్లూరు టౌన్ ASP గారు అభినందించి నగదు బహుమతులు అందజేసి, రివార్డులు కొరకు శ్రీ SP గారికి సిఫార్స్ చేయడమైనది.
స్టేషన్ హౌస్ ఆఫీసర్
వేదాయపాలెం పోలీసు స్టేషన్,
నెల్లూరు టౌన్.