
**అమ్మవారి కృపా కటాక్షం అందరిపై ఉండాలి* *- ముక్కు రాధాకృష్ణ గౌడ్ బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు**
నెల్లూరు నగరంలోని మూలపేట శివాలయం ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ జ్ఞానసరస్వతి దేవి అమ్మవారి జన్మదినం సందర్భంగా వసంత పంచమిని పురస్కరించుకొని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి అక్షరాభ్యాసాలు చేసే పిల్లలు వారి తల్లిదండ్రులు భక్తుల పెద్ద ఎత్తున ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతీదేవి అమ్మవారి మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమినే శ్రీ పంచమీ లేదా వసంత పంచమి అంటారని ఆమె ఈ రోజే జన్మించారని మూలా నక్షత్రంలో జన్మించినందున అమ్మవారిని పూజిస్తే జ్ఞానవంతులవుతారని అఖండ విద్యావంతులవుతారని ప్రజలందరి విశ్వాసం అన్నారు. ఆమెను ప్రతి సంవత్సరం రెండుసార్లు ఘనంగా పూజించుకుంటామని మొదటిది వసంత పంచమి, రెండవది దసరా నవరాత్రులలో వచ్చే మూలా నక్షత్రం రోజున పూజిస్తామని ఈ రెండు సార్లు కూడా ఘనంగా అక్షరాభ్యాసాలు చేస్తామన్నారు. కావున ప్రతి ఒక్కరికి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించాలని ఆయన ఆకాంక్షించారు. పై కార్యక్రమంలో 1200 మందికి పైగా భక్తులు పాల్గొనడం జరిగింది.
అలాగే తమ కుటుంబం గత ఆరు సంవత్సరాలుగా సంవత్సరంలో రెండుసార్లు అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను సమర్పించడం జరుగుతుందని తెలియజేశారు.
అమ్మవారి సేవ చేసుకునే అవకాశం దక్కినందుకు చాలా సంతోషపడుతున్నానన్నారు.