*బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోలిచెర్ల ఉదయ్ కుమార్*

భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోలిచెర్ల ఉదయ్ కుమార్ ను ఆమోర్చ రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ గారు నియమించారు. ఆయన కొడవలూరు మండలం ఎల్లాయపాలెం గ్రామంలో జన్మించి చిన్నతనం నుండే ఆర్.ఎస్.ఎస్ లో స్వయంసేవక్ గా పెరిగి అనంతరం విద్యార్థి దశలో వి.ఆర్ కళాశాలలో ఏబీవీపీ నాయకుడిగా పనిచేస్తూ ఏబీవీపీ నగర కార్యదర్శి గాను, జిల్లా కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబరు ఎస్. వి .యూనివర్సిటీ తిరుపతి ఇన్చార్జ్ ,విక్రమ సింహపురి యూనివర్సిటీ ఇన్చార్జిగాను, బీజేవైఎం నెల్లూరు జిల్లా అధ్యక్షులు గాను ,బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేవైఎం కోస్తాంధ్ర జోనల్ ఇన్చార్జిగాను పని చేశారు. ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో పార్టీలో అత్యంత కీలక బాధ్యతలు అప్పజెప్పిన ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ ,బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మరియు ఇతర జిల్లా, రాష్ట్ర నాయకులకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed