*SPS నెల్లూరు జిల్లా*

*సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపాలెంలో కార్డన్ సర్చ్ ఆపరేషన్-జిల్లా యస్.పి. డా.అజిత వేజెండ్ల,IPS., *

 సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచటానికి, జిల్లాలో అసాంఘీకకార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యంగా, సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపాలెం నందు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహణ.
 జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారి సూచనల మేరకు, నెల్లూరు టౌన్ SDPO శ్రీమతి దీక్ష,IPS., గారి ఆధ్వర్యంలో, నెల్లూరు టౌన్ సబ్ డివిజన్ లోని CI లు, SI లు, సిబ్బంది మరియు స్పెషల్ పార్టీలతో కలిపి సుమారు 60 మందితో ఆపరేషన్.
 సరైన పత్రాలు లేని 20 బైకులు స్వాధీనం, అనుమానితులను తనిఖీ చేసి, వారి వేలిముద్రల సేకరణ.
 నేర నియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల అడ్డుకట్టకి పోలీసు శాఖ నిర్వహించే కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమానికి ప్రజలు వంతు సహకారాన్ని అందించాలని పోలీసు అధికారులు కోరారు.
 చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాల నివారణ, శాంతి భద్రతలను పరిరక్షణ, అసాంఘీక శక్తుల ఏరివేతే లక్ష్యం.
 ప్రత్యేక కార్యాచరణ ద్వారా జిల్లాలో హింసాత్మక చర్యలు అరికట్టుటకు ప్రణాళికలు.
 జిల్లాలో అసాంఘీకకార్యకలాపాల నిర్మూలనకు కఠిన ఆదేశాలు.. అతిక్రమించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు నమోదు చేస్తాం.
 ఈ శోధన ముఖ్య ఉద్దేశ్యం పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం మరియు గంజాయి కొరకు ప్రత్యేకముగా తనిఖీ నిర్వహించుట మరియు వెండి, బంగారు వంటి చోరీ సొత్తు, అనుమానంగా ఉన్న రికార్డులు లేని అన్నీ వస్తువులు, వాహనాలు, అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు వాటివి గుర్తించి స్వాధీన పరుచుకోవడం.
 సంతపేట పరిధిలో గల ఇళ్ళలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా శోధించిన నెల్లూరు పోలీసులు.
 చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్ధానిక పోలీసులకు లేదా డయల్ 112/100 కు తెలియజేయాలని కోరారు.

జిల్లా పోలీసు కార్యాలయం, తేది.22.01.2026

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed