**సర్దార్ గౌతు లచ్చన్న స్ఫూర్తితో పని చేస్తా – ముక్కు రాధాకృష్ణ గౌడ్ బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు**

నెల్లూరు నగరంలోని విజయ మహాల్ గేట్ సెంటర్ శ్రీనివాస అగ్రహారం నందు జిల్లా గౌడ యువజన సంఘ కార్యాలయంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాధాకృష్ణ గౌడ్ ని ఘనంగా సన్మానించడం జరిగింది.

పై కార్యక్రమంలో ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ తనను గౌడ్ సంఘం జిల్లా నాయకులు ఘనంగా సన్మానించడం చాలా సంతోషంగా ఉందని, అలాగే తాను గౌడ్ కులంలో పుట్టినందుకు గర్వపడుతున్నానని, అందరి సహకారంతో తాను రాజకీయంగా ఎదగడమే కాకుండా కులంలో పుట్టిన ప్రతి ఒక్కరిని అన్ని రంగాలలో అభివృద్ధి సాధించే దిశగా తాను ఎప్పుడు కృషి చేస్తానని, ఆ విధంగా ప్రతి ఒక్కరికి తన సహాయ, సహకారాలు ఎప్పటికీ ఉంటాయని తెలియజేశారు.
అలాగే మునుముందు రంగం ఏదైనా గౌడ్ బిడ్డలందరూ అత్యుత్తమ విజయాలను సాధించాలని తద్వారా కులానికి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి గర్వకారణం గా నిలవాలని ప్రతి ఒక్కరూ దేశభక్తి, జాతీయ భావాలు, నైతిక విలువలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

తోటి వారికి సహాయ సహకారాలు అందించే గుణాన్ని అలవర్చుకోవాలని సమాజంలోని అన్ని వర్గాల అన్ని కులాల ప్రజలతో మంచిగా ఉంటూ వారందరి సహాయ సహకారాలతో అభివృద్ధిని సాధించే దిశగా గౌడ్ కులస్తులు పాటుపడాలని అలాగే కులవృత్తిని కూడా విడవకుండా నేటికీ కష్టపడుతున్న వృత్తిదారులందరికీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే విధంగా ప్రభుత్వాలను ఒప్పించి సహాయపడాలని అదేవిధంగా ఎక్సైజ్, పోలీస్ తదితర డిపార్ట్మెంట్ల నుంచి వచ్చేటువంటి సమస్యలను అధిగమించి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నటువంటి కులస్తులు అందరిని అభినందించారు. కులస్తులకు వచ్చే ప్రతి సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు.

పై కార్యక్రమంలో గౌడ్ సంఘం జిల్లా నాయకులు వెంపులూరు.భాస్కర్ గౌడ్, అన్నం. దయాకర్ గౌడ్, దాసరి.ప్రసాద్ గౌడ్, తిరకాల.శివ గౌడ్, దద్దోలు. పవన్ గౌడ్, తిరకాల. మోహన్ బాబు గౌడ్, దాసరి. హేమంత్ గౌడ్, కోసూరు. వంశీ గౌడ్, జంపాన్ని. వంశీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed