
**ప్రాణం ఉన్నంతవరకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా – పాక సత్యనారాయణ బిజెపి రాజ్యసభ సభ్యులు**
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ మరియు రాజ్యసభ సభ్యులు పాక. సత్యనారాయణను ఘనంగా సన్మానించిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్
అనంతరం పాక సత్యనారాయణ మాట్లాడుతూ తాను చిన్నతనంలో ఆర్ఎస్ఎస్ లో చేరి నిత్యం శాఖకు వెళ్లే వాడినని అలాగే ప్రధమ, ద్వితీయ, తృతీయ వర్ష శిక్షణలను పూర్తి చేశానని, విద్యార్థి దశలో ఏబీవీపీ భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక బాధ్యతలు నిర్వహించాను అని అనంతరం భారతీయ జనతా పార్టీలో 1980 నుంచి పని చేస్తున్నానని భీమవరం నగర కార్యదర్శి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు, యువమోర్చా జిల్లా అధ్యక్షులు, మరియు బిజెపి రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎలక్షన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, లీగల్ సెల్ వంటిఅనేక కమిటీలలో చైర్మన్గా పని చేశానని బిజెపి కేంద్ర నాయకత్వం తనపై ఎంతో నమ్మకంతో రాజ్యసభ సభ్యుడిగా నియమించింది అని తెలిపారు. నేడు ఎంపీగా పనిచేయడం చాలా సంతోషించదగ్గ విషయమని అలాగే గత 45 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాతో సనిహిత సంబంధాలు ఉన్నాయని, నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని స్థాయి నాయకులతో మంచి అనుబంధం ఉందని తెలిపారు.
అలాగే తన ప్రాణం ఉన్నంత వరకు భాజాపా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. నెల్లూరు జిల్లా అభివృద్ధికి తన సాయి శక్తుల కృషి చేస్తానని దాని పరంగా తనని ఎప్పుడైనా సంప్రదించవచ్చని, అలాగే పార్టీ బలోపేతానికి, నాయకుల బలోపేతానికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.
పై కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కో-ఆపరేటివ్ సెల్ కొకన్వీనర్ కోట వెంకటేశ్వరరావు మాజీ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పోలిచర్ల ఉదయ్ కుమార్ దోమోర్చా నాయకులు పైడి చరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు.