
* (29.12.2025)*
*SPS నెల్లూరు జిల్లా*
*చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తాం.. నెల్లూరు జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,ఐపియస్.,*
*ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమంలో 111 ఫిర్యాదులు స్వీకరణ.*
• *ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదు.. ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటీషన్లను పరిష్కరించాలని ఆదేశాలు.*
• *’ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, చట్టపరిధిలో పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా యస్.పి. గారు.*
• *జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదిదారులతో జిల్లా యస్.పి. గారు స్వయంగా మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.*
*ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 111 ఫిర్యాదులు వచ్చాయి.*
*వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..*
1. కావలి రూరల్ పరిధికి చెందినటువంటి మహిళను, ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు వస్తాయని కావలికి చెందిన నవీన్ నమ్మించి ఏడు లక్షల రూపాయలు తీసుకొని, తీసుకున్న నగదు తిరిగి ఇవ్వకుండా అడిగితే బెదిరిస్తున్నాడని విచారించి న్యాయం చేయాలని కోరారు.
2. కోవూరు పరిధికి చెందినటువంటి రైతుని, అదే ప్రాంతానికి చెందిన మల్లికార్జున రెడ్డి అనే ధాన్యం వ్యాపారి తన వద్ద 65 లక్షలు విలువ గల ధాన్యాన్ని కొనుగోలు చేసి నగదు ఇవ్వలేదని అంతేకాకుండా పలువురు రైతులు వద్ద సుమారు కోటి రూపాయలు పైగా ధాన్యం కొనుగోలు చేసి ఎటో వెళ్లిపోయారని ఆచూకీ కనుగొని విచారించి న్యాయం చేయాలని కోరారు.
3. నవాబ్ పేట పరిధికి చెందిన మహిళ, తను వికలాంగురాలినని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తన ఇంటి ప్రక్కన ఉన్న కృష్ణవేణి అనే మహిళ తన కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకొని ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ, తనని తన భర్తని చంపుతానని బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని కోరారు.
4. సంగం పరిధికి చెందినటువంటి వృద్ధ దంపతులను, తన ఇద్దరు కుమారులు వారి బాగోగులు, జీవనోపాది పట్టించుకోవడంలేదని, వైద్య ఖర్చులకు కూడా నగదు ఇవ్వడం లేదని, ఇబ్బంది పెడుతున్నారని, విచారించి న్యాయం చేయాలని కోరారు.
5. నెల్లూరు రూరల్ పరిధికి చెందినటువంటి మహిళ యొక్క కుమారుడు కనిపించడం లేదని, నెల్లూరు రూరల్ స్టేషన్ నందు కేసు కూడా నమోదు చేసి ఉన్నారని, త్వరితగతిన విచారించి ఆచూకీ కనుగొని అప్పగించాలని కోరారు.
6. బుచ్చి పరిధికి చెందినటువంటి మహిళను, తన భర్త అత్తమామలు కొట్టి వేధిస్తున్నారని అదేవిధంగా జలదంకి పరిధికి చెందిన మహిళను, తన భర్త అత్తమామలు ఆడపడుచులు మానసికంగా వేధిస్తూ ఉన్నారని, తన వద్ద అనారోగ్యంతో ఉన్న ఇద్దరు పిల్లలు అందర్నీ ఇబ్బంది పెడుతున్నారని, కౌన్సిలింగ్ నిర్వహించి, కుటుంబాన్ని చక్కదిద్దాలని కోరారు.
7. సంగం పరిధికి చెందినటువంటి మహిళను తన భర్త మున్వర్ నుండి రక్షణ కల్పించాలని, గతంలో తనమీద హత్యాయత్నం కేసులో జైలుకెళ్ళి వచ్చాడని, ప్రస్తుతం తన ఇంటి చుట్టూ తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, న్యాయం చేయాలని కోరారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,ఐపియస్ గారు హామీ ఇచ్చారు.
ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి CH.సౌజన్య గారు, ఆత్మకూరు DSP శ్రీ వేణుగోపాల్ గారు, లీగల్ అడ్వైజర్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారు, PCR CI శ్రీ భక్తవత్సల రెడ్డి, మహిళా స్టేషన్ CI శ్రీ సుబ్బారావు గార్లు మరియు కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం, SPS నెల్లూరు జిల్లా.