*నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో “హ్యాపీ సండే” అనే వినూత్నమైన కార్యక్రమo*

 

నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో “హ్యాపీ సండే” అనే వినూత్నమైన కార్యక్రమాన్ని స్థానిక 11 వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ స్రవంతి స్కూల్ సమీపంలో ఆదివారం నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ హాజరయ్యారు.

కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీను మ్యాజిక్ షో, మిమిక్రీ, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్,లెమన్ స్పూన్, ఆటలతో నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు, ఆర్.ఎన్.ఆర్. స్కూలు విద్యార్థులు ఆటపాటలతో అలరించారు.

ఈ సందర్భంగా వేదికపై చిన్నారులు, పెద్దలు చేసిన సినీ నృత్యాలు ప్రేక్షకులను హోరెత్తించి కేరింతలు పెట్టించాయి.

అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పట్టణ పుర శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ ఆలోచనలతో రూపొందించిన ఈ కార్యక్రమం మంచి ఆదరణ పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాలలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించి స్థానిక ప్రజలను అలరించనున్నామని తెలిపారు.

దైనందిన జీవితంలో వారం మొత్తం చేసిన శ్రమను మర్చిపోయి ఉల్లాసంగా గడిపేందుకు హ్యాపీ సండే కార్యక్రమం ఉపయుక్తమవుతుందని తెలిపారు. వినూత్నమైన హ్యాపీ సండే కార్యక్రమాన్ని అమలు చేసి విజయవంతంగా నిర్వహించబోనున్నామని కమిషనర్ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అరుణ, ప్రజా ప్రతినిధులు, నెల్లూరు నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ హిమబిందు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, వార్డు సచివాలయం కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగర పాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed