
*చదువు తో పాటు విద్యార్థులకు పరిశుభ్రత కూడా అవసరం*
– పరిశుభ్రతపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలి
– ప్రతి రోజు స్నానం చేయాలి, యూనిఫాం శుభ్రంగా ఉంచుకోవాలి.
– పరిశుభ్రమైన అలవాట్లు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి.
– క్రమశిక్షణతో కూడిన జీవనం మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
– విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు క్రికెట్, వాలిబాల్, షటిల్ కిట్లు అందచేస్తానని హామి.
– “ముస్తాబు” కార్యక్రమం సందర్భంగా పెనుబల్లిలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన ముస్తాబు కార్యక్రమంలో భాగంగా ఆమె బుచ్చిరెడ్డి పాళెం మండలం పెనుబల్లి హై స్కూల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థినీ, విద్యార్థులతో మమేకమై చదవులో పురోగతిలో పాటు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్ద్యార్థి దశ నుంచే విద్యార్థులకు పరిశుభ్రత పట్ల అవగాహన కలిగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గార్లు పత్యేక శ్రద్ద తీసుకొని ముస్తాబు కార్యక్రమాన్ని రూపకల్పన చేశారని ఆమె తెలిపారు. పరిశుభ్రమైన అలవాట్లు మన ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతాయని విద్యార్థులకు చదువు తో పాటు పరిశుభ్రత కూడా అవసరమన్న విషయాన్ని ఆమె విద్యార్థినీ, విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించాలని పరిశుభ్రమైన యూనిఫామ్ వేసుకొని, నీటుగా క్రాఫ్ చేసుకుని క్లాసులకు రావాలని కోరారు. గోళ్లు కత్తిరించుకోవడం, షూస్ పరిశుభ్రంగా ఉండేలా శ్రద్ద తీసుకోవాలని సూచించారు.
పరిశుభ్రమైన అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడతాయని, క్రమశిక్షణతో కూడిన జీవనం ఆత్మ విశ్వాసాన్ని నింపుతుందని ఆమె విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన ముస్తాబు కార్యక్రమం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రతి విద్యార్థి పరిశుభ్రత పాటించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. భోజనం తినే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవడం, బహిర్భూమి వెళ్ళాక చేతులు శుభ్రం చేసుకోవాల్సిన ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. విద్యార్థులు తమ పాఠశాలకు స్పోర్ట్స్ కిట్స్ కావాలని కోరిన నేపథ్యంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు క్రికెట్, వాలిబాల్, షటిల్ కిట్లు అందచేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు హామీ యిచ్చారు. పెనుబల్లి పాఠశాలలో వాటర్ ప్లాంట్ రిపేరై వుందన్న విద్యార్థుల ఫిర్యాదుతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ టెక్నీషియన్ ను పంపి రిపేర్ చేయిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఓడా పెంచలయ్య, బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, టిడిపి మండల అధ్యక్షులు బెజవాడ జగదీష్, టిడిపి సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, రాష్ట చేనేత సంఘ నాయకులు కెవి శేషయ్య, స్థానిక టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.