
*తేదీ:19-12-2025*
*నెల్లూరు*
*మున్సిపల్ కార్మికులపై దౌర్జన్యం ఖండిస్తున్నాం…*
*YSRCP మహిళా జోనల్ అధ్యక్షురాలు శ్రీమతి మెయిళ్ళ గౌరీ….*
మున్సిపల్ కార్మికులు వాళ్లకి రావలసిన హక్కుల కోసం 40 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తుంటే కనీసం చీమకుట్టినట్టైనా స్పందన లేదన్నారు.
శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు ఆడవారిని కూడా చూడకుండా, మహిళా పోలీసులు లేకుండా ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి వాహనాల్లో ఎక్కించడం దారుణమన్నారు. ఈ రాష్ట్రంలో మహిళలకు హక్కులే లేవన్నట్లు పోలీసులు వ్యవహరించడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎక్కడ చూసినా మహిళలలు, చిన్నారులపై దౌర్జన్యాలు లైంగిక వేధింపులు చేస్తుంటే పోలీసులు చేతకానితనంగా వ్యవహరిస్తున్నారన్నారు.
కూటమి ప్రభుత్వంలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు.
మున్సిపల్ కార్మికులు చేస్తున్న సేవలు గుర్తించకపోయిన పర్లేదు గాని ఆ గౌరవ పరచటం అన్యాయం అన్నారు.
ఈ విషయాన్ని మహిళ కమీషన్ దృష్టి కి తీసుకెళ్తామని తెలిపారు.
మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలిగిన వైఎస్ఆర్సిపి మహిళా విభాగం అండగా ఉంటుందన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి, జిల్లా వైసీపీ అంగన్వాడి వింగ్ అధ్యక్షురాలు లావణ్య పాల్గొన్నారు.