
*శిక్షణ పూర్తి చేసుకున్న కార్యదర్శులకు ధ్రువీకరణ పత్రాలు అందజేసిన కమిషనర్ వై ఓ నందన్*
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణపై హైదరాబాద్ రాజ్ భవన్ రోడ్ లోని ఏ.ఎస్.సి.ఐ కళాశాలలో మూడు రోజులపాటు డిసెంబర్ 16 నుంచి 18 వరకు జరిగిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ శిక్షణ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థకు చెందిన వార్డు సచివాలయ ఉద్యోగులు హాజరయ్యారు.
శిక్షణ పూర్తి చేసుకున్న కార్యదర్శులకు కమిషనర్ వై.ఓ నందన్ శుక్రవారం కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
శిక్షణ పొందిన వారిలో శానిటేషన్ విభాగానికి చెందిన దారా సురేష్ బాబు, దినేష్, సరస్వతి దేవీ, ఇంజనీరింగ్ విభాగం నుంచి విష్ణు తేజ లు ఉన్నారు.