SPS నెల్లూరు జిల్లా,

*స్వయంగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.,*

 మద్రాస్ బస్టాండ్ నుండి VRC సెంటర్, మార్కెట్ మీదుగా నడుస్తూ పుట్ పెట్రోలింగ్ స్వయంగా నిర్వహించిన జిల్లా యస్.పి. గారు..
 అక్కడి ప్రజలు, దుకాణదారులతో మాట్లాడుతూ పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించిన యస్.పి.గారు.
 మహిళలు, బాలబాలికల భద్రత, రక్షణే ప్రధమ కర్తవ్యంగా, ప్రజల ధన, మాన, ప్రాణ, ఆస్థి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకుంటున్న జిల్లా పోలీసు యంత్రాంగం.
 ప్రజలలో ధైర్యాన్ని నింపడానికి, భద్రతా వాతావరణం కల్పించడానికి పోలీసు శాఖ పరంగా అన్ని చర్యలు..
 ఒక వైపు సన్నిహిత సత్సంబంధాలు మెరుగు, సిబ్బందిని అప్రమత్తం చేస్తూ, మరో వైపు పటిష్ట నిఘాకు చర్యలు.
 రాత్రి వేళ తిరిగే ఆకతాయిలపై, ఓపెన్ డ్రింకింగ్ మరియు మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పై కఠిన చర్యలు.
 గంజాయి త్రాగినా అమ్మినా, రవాణా చేసినా, సాగు చేసినా కఠిన చర్యలు తీసుకోబడతాయి. అటువంటి వారు ఉన్న ఎడల వారి వివరాలు అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
 అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు మరియు నేరాల నియంత్రణకు, సమస్యాత్మక మరియు నేరములు అధికంగా జరగడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి, భవిష్యత్తులో వాటిని నివారించుటకు ఫుట్ పెట్రోలింగ్ అమలు.
 ఎప్పటికప్పుడు సదరు ప్రాంతాలలో ప్రజలతో మమేకమై ఎప్పటికప్పుడు అక్కడ జరిగేటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సమాచారాన్ని సేకరించడం, నియంత్రణ చర్యలు అందుకు ప్రజల సహకారం, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారిని కూడా పోలీస్ శాఖ తీసుకునే చర్యల్లో భాగస్తులుగా చేయడం జరుగుతుంది.

జిల్లా పోలీసు కార్యాలయం, తేది.10.12.2025.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed