
SPS నెల్లూరు జిల్లా,
*జిల్లాలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలకు పలు సూచనలు చేసిన గుంటూరు రేంజ్ ఐజి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి,IPS., , జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.,.*
జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా భద్రతను మరింత బలోపేతం చేయుటకు ప్రతి బృందానికి ఒక SI స్థాయి అధికారి ఇంచార్జ్ గా ఉంటూ 6 స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసారు.
జిల్లా పోలీసు వ్యవస్థను మరింత చురుకుగా, సమయస్పూర్తితో, సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళాలని తెలిపారు.
ప్రతి బృందం నిర్దిష్ట ప్రాంతాల్లో, నిర్దిష్ట నేర రకాలపై ఫోకస్ పెట్టి పనిచేయాలి.
నేరాలు జరుగుటకు అవకాశం ఉన్న సున్నితమైన ప్రాంతాలను గుర్తించి, అక్కడ సడెన్ రైడ్స్ నిర్వహించాలి.
రాత్రిపూట పహారా, పాయింట్ చెకింగ్, మొబైల్ పార్టీల గస్తీ పెంచాలని సూచించారు.
గాంజా అమ్మకం, వినియోగం, రవాణాపై జిల్లా వ్యాప్తంగా అత్యంత కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వీకెండ్స్, ఫెస్టివల్ డేస్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ప్రమాదాలను ముందస్తుగా అరికట్టాలి.
క్రిమినల్స్ ఉన్న ప్రదేశాలు, అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్లు పద్ధతి ప్రకారం నిర్వహించాలి.
అక్రమ కార్యకలాపాలకు వేదికగా ఉపయోగిస్తున్న లాడ్జీలు, లాడ్జ్ బుకింగ్ రికార్డ్స్‌పై తనిఖీలు చేయాలి.
ఫీల్డ్‌లో ఉన్న స్టాఫ్ ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉండేలా సూచించారు.
నేరాలను అరికట్టడమే కాకుండా ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలి.
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.10.12.2025.