
SPS నెల్లూరు జిల్లా
*కావలిలో స్వయంగా వాహనాలు తనిఖీ చేసిన జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.,*
ఈ రోజు సాయంత్రం కావలి టౌన్ లో స్వయంగా వాహనాలు తనిఖీలు నిర్వహించిన జిల్లా యస్.పి. గారు.
జిల్లా శాంతి భద్రతలు మరియు నేర నియంత్రణ లక్ష్యంగా, జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్, నాకా బంది, ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పై విస్తృత తనిఖీలు.
గంజాయి త్రాగినా అమ్మినా, రవాణా చేసినా, సాగు చేసినా కఠిన చర్యలు తీసుకోబడతాయి. అటువంటి వారు ఉన్న ఎడల వారి వివరాలు అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
అక్రమ రవాణా నియంత్రణ మరియు నేరస్తుల గుర్తింపుకు సమగ్ర చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడి.
తనిఖీలలో అనుమతి లేని ఆయుధాలు, కత్తులు, గంజాయి, అనుమతి లేని మద్యం, వస్తువులను గుర్తిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు.
రాత్రి వేళల్లో సమూహంగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతుల్ని చేసే రౌడీలపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.
వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు.
ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచనలు.
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.10.12.2025.