*సచివాలయ పరిధిలో కొత్తగా నిర్మించిన భవనములు, అదనంగా నిర్మించిన అంతస్తులు, అపార్ట్మెంట్లు, భవనము యొక్క వినియోగంలో మార్పులు, ఖాళీ స్థలం పన్నులు గుర్తించి టాక్స్ పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించిన కమిషనర్ వై ఓ నందన్*

 

నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ వారాంతపు సమీక్ష సమావేశంలో భాగంగా రెవిన్యూ సిబ్బందితో కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయ పరిధిలో కొత్తగా నిర్మించిన భవనములు, అదనంగా నిర్మించిన అంతస్తులు, అపార్ట్మెంట్లు, భవనము యొక్క వినియోగంలో మార్పులు, ఖాళీ స్థలం పన్నులు గుర్తించి టాక్స్ పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

రెవిన్యూ ఆఫీసర్లు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు ప్రతిరోజు సచివాలయ కార్యదర్శులకు లక్ష్యాలను నిర్దేశించి అవి అమలు అగునట్లు పర్యవేక్షించాలని సూచించారు.

డిసెంబర్ 13 న జరగబోవు నేషనల్ లోక్ అదాలత్ కు రెవెన్యూ సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండి నోటీసులు జారీ చేసిన బకాయి దారులు భవన యజమానులందరూ హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని, గతంలో నోటీసులు జారీ చేసి ఇంకను చెల్లించని బకాయిదారుల పై తదుపరి చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రెవిన్యూ బకాయిలు, ఖాళీ స్థలం పన్నుల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్వీస్ రిక్వెస్ట్లు, ఐజిఆర్ఎస్ అప్లికేషన్లు నిర్దేశించిన గడువు లోపల పరిశీలించి అనుమతుల కొరకు తదుపరి అధికారులకు పంపించాలని ఆదేశించారు.

ప్రతి పరిపాలనా కార్యదర్శి ఉదయము 8 గంటల నుండి సాయంత్రం 5 వరకు రెవెన్యూ వసూళ్లు పై శ్రద్ధ వహించాలని, ఇప్పటివరకు ఖాళీ స్థలం పన్ను విధించని ఖాళీ స్థలాలను గుర్తించి హెచ్చరిక బోర్డులను ఉంచాలని ఈ సందర్భంగా కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, టీ.పి.ఆర్.ఓ. వాసు బాబు, రెవిన్యూ ఆఫీసర్లు శ్రీనివాసులు, సమద్, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed