
సఖి సురక్ష మెడికల్ క్యాంప్ లను సద్వినియోగం చేసుకోండి
– కమిషనర్ వై.ఓ నందన్
నెల్లూరు సిటీ పరిధిలోని కపాడిపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ లో మంగళవారం సఖి సురక్ష స్క్రీనింగ్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు.
ముఖ్య అతిథిగా మున్సిపల్ కమీషనర్ వై.ఓ నందన్, పీడీ బి. లీలా రాణి హాజరైనారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల ఆరోగ్యం బాగుండాలన్న ఉద్దేశ్యంతో థైరాయిడ్, షుగర్, విటమిన్ లోపం, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, Menstrual Hygenic cancer, ఎనీమియా, ప్రోటీన్ లోపం, మెంటల్ illness కౌన్సిలింగ్ వంటి 16 రకాల టెస్ట్ లు చేస్తున్నారని తెలిపారు.
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 8 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో నిర్వహించుకున్న మెడికల్ క్యాంప్ లను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ తెలియచేశారు.
క్యాంప్ లో టెస్టులను పూర్తి ఉచితముగా చేస్తారని, పొడుపు సంఘాలలోని మహిళలు మరియు ప్రజలు వై యస్ ఆర్ నగర్, కిసాన్ నగర్, పడారుపల్లి, కపాడిపాలెం, చంద్రమౌళి నగర్, రామచంద్రాపురం, చింతారెడ్డిపాలెం, రాజా గారి వీధి అర్బన్ హెల్త్ సెంటర్లలో 8వ తేదీ నుండి 11 వ తేదీ వరకు నిర్వహించే మెడికల్ క్యాంప్ లను సద్వినియోగం చేసుకోమని తెలియచేశారు.
49 వ డివిజన్ మహిళా క్లస్టర్ ఇంచార్జి కె. రేవతి మాట్లాడుతూ మెప్మా ద్వారా నిర్వహిస్తున్న సఖి సురక్ష స్క్రీనింగ్ టెస్ట్ లను ప్రతి మహిళ చేయించుకోవాలని, మహిళలకు మంచి ఆరోగ్యం ఉండాలన్న సంకల్పంతో సుమారుగా 10,000/- రూపాయల విలువ చేసే పరీక్షలు చేస్తున్నారని, అందరూ ఉపయోగించుకోవాలని చెప్పారు.
5 లక్షల ఆరోగ్య బీమా విలువ గల ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఇస్తారని, దీని ద్వారా నెట్వర్క్ హాస్పిటల్ లలో అడ్మిట్ అయ్యి చూపించుకోవచ్చని తెలిపారు.
ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా, బి. లీలా రాణి క్యాంప్ ను సందర్శించి పేషంట్ లతో మాట్లాడారు. ఆధార్ కీ లింక్ అయిన ఫోన్, పొదుపు గ్రూపు ఐ డి కార్డును తెచ్చుకోవాలి అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీసర్ డా జిజియా, మెడికల్ ఆఫీసర్లు, మెప్మా సీ.ఎం.ఎం కవిత, సి.ఓ లు భవాని, హనుమయి, ఆర్. పి లు పాల్గొన్నారు.