
*లేఅవుట్ పరిధిలోని ప్లాట్ లకు సంబంధించిన అనుమతులను పరిశీలించారు. నూతనంగా నిర్మించిన భవనాలకు టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతులను, ఖాళీ స్థలం పన్నులను తనిఖీ చేసిన కమిషనర్ వై ఓ నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ మంగళవారం స్థానిక అల్లిపురం ప్రాంతంలోని భగవాన్ వెంకయ్య స్వామి లేఔట్ ప్రాంతాన్ని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి సందర్శించారు.
లేఅవుట్ పరిధిలోని ప్లాట్ లకు సంబంధించిన అనుమతులను పరిశీలించారు. నూతనంగా నిర్మించిన భవనాలకు టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతులను, ఖాళీ స్థలం పన్నులను తనిఖీ చేశారు.
ప్రతి ఒక్కరు తప్పనిసరిగా భవన నిర్మాణాల సమయంలో పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, భవనాలు నిర్మించే సమయంలో అనుమతులను ప్రదర్శించాలని కమిషనర్ స్థానికులకు వివరించారు.
అనుమతులు లేని అక్రమ లేఔట్ లలోని ప్లాట్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్. పథకాన్ని, ప్రభుత్వం నిర్దేశించిన బి.పి.ఎస్ పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ స్థానిక ప్రజలకు వివరించారు. ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ పధకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అర్హులందరూ సద్వినియోగం చేసుకునేలా ప్రచారం కల్పించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనిల్ కుమార్, డి.ఈ ముజాహిదిన్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు