*అందరి నోటా ఒకటే మాట – ఆదాలన్నకే మా ఓటు — ఆదాల హిమబిందు*

*రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దత్తుగా జడ్పీ చైర్స్ పర్సన్ ఆనం అరుణమ్మ, నగర మేయర్ స్రవంతి తదితరులతో కలసి 12వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం*

*అభివృద్ధి చేసిన ఆదాలకే మా ఓటు అంటున్న ప్రజలు — ఆదాల హిమబిందు*

*మే 13వ తేదీ ప్రతి ఒక్కరు ఓటు వేసి పేదలకు మంచి చేసిన జగనన్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి — ఆదాల హిమబిందు*

*ప్రేమానురాగాలతో ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు — ఆదాల హిమబిందు*

*మంచితనానికి మానవత్వానికి మారుపేరేనా మీ నాన్నగారికే మా ఓటు అని ప్రజలు చెప్పడం చాలా సంతోషంగా ఉందని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కుమార్తె ఆదాల హిమబిందు చెప్పారు*. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఇంటింటా ప్రచారానికి వెళ్లిన తనకు ఏ గడపకి వెళ్లిన *అందరి నోటా ఒకటే మాట- ఆదాలన్నకే వేస్తామని* ఆయా ప్రాంతాల ప్రజలు స్వయంగా చెప్పడం చాలా అరుదైన సంఘటనని, అంతటి మంచి పేరు తెచ్చుకున్న నాన్నగారు, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కుమార్తెగా పుట్టడం నాకు బహు ఆనందంగా ఉందని ఆదాల హిమబిందు తెలిపారు. ఈ మేరకు గురువారం నెల్లూరు జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు మేయర్ పోట్లూరు స్రవంతి తదితరులతో కలిసి 12వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిగార్లకు మద్దత్తుగా ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఆదాల హిమబిందు చేపట్టారు. ఈనెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల ఓటింగ్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేసిన జగనన్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని, కేవలం తొమ్మిది నెలల సమయంలో రూ.150 కోట్లకు పైబడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత ఆదాల ప్రభాకర్ రెడ్డిగారిని , గొప్ప విజునున్న నాయకులు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన తనకు ఎంతో ప్రేమానురాగాలు పంచి సొంత మనిషిల ఆదరిస్తున్న రూరల్ నియోజకవర్గంలోని ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని హిమబిందు చెప్పారు.

నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి దిశా నిర్దేశంలో నిర్వహిస్తున్న ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో యువ నాయకులు కొండ్రెడ్డి భరత్ కుమార్, క్లస్టర్ -1 అధ్యక్షులు ముడియాల రామిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు పొట్లూరు జయవర్ధన్, నగర పార్టీ మహిళా అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీ సునంద, ఏపీ స్టేట్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ పాశం శ్రీనివాస్, నగర పార్టీ ఉపాధ్యక్షులు వేలూరు శ్రీధర్ రెడ్డి, టీఎల్ఎఫ్ అధ్యక్షులు హరితారెడ్డి, భార్గవి రెడ్డి 12వ డివిజన్ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed