*ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు విజయసాయి రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డిగార్ల అధ్యక్షతన రూరల్ వైసీపీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం*

 

ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు విజయసాయి రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డిగార్ల అధ్యక్షతన బుధవారం రాత్రి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, డివిజన్స్ ఇన్చార్జీలు, పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో మూడు రోజులు మాత్రమే ఉండడంతో అనుసరించాల్సిన విధి విధానాలపై ఇరువురు అగ్ర నాయకులు సర్పంచులు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, డివిజన్స్ ఇన్చార్జీలు, పార్టీ ముఖ్య నాయకులకు దిశనిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరిన నేపథ్యంలో వైస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు అనుసరించాల్సిన వ్యూహ ప్రత్యుహలపైన సమగ్రంగా చర్చించారు. రానున్న నాలుగు రోజులే అత్యంత కీలకమైనవని, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందరు సమిష్టిగా ఒక్కటై పార్టీ భారీ విజయాని కృషి చేయాలని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు విజయసాయిరెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డిగార్లు సంయుక్తంగా పిలుపునిచ్చారు. రానున్న ఐదు సంవత్సరాలలో ప్రతి కార్యకర్త కష్టాన్ని గుర్తు పెట్టుకొని వారి, వారి కుటుంబాలను సంక్షేమానికి అన్నిరకమైన చర్యలు తీసుకొని అన్నివిధాల అండగా ఉంటామని ఇరువురు అగ్ర నాయకుడు భరోసా ఇచ్చారు. మా ఇద్దరి విజయానికి మీరు కృషి చేయండి మీ సంక్షేమానికి మేమిద్దరం కలసి సమిష్టిగా పాటుపడతామని ప్రత్యేక సమావేశంకు హాజరైన వైస్సార్సీపీకీ చెందిన సర్పంచులు ఎంపీటీసీలు కార్పొరేటర్లు డివిజన్స్ ఇన్చార్జీలు, పార్టీ ముఖ్య నాయకులకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు విజయసాయిరెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డిగార్లు స్పష్టమైన భరోసా కల్పించారు. ఈ ఎన్నికల్లో మనమే గెలుస్తున్నామని, ఏ సమస్య వచ్చిన మేమిద్దరం మీకు అండగా నిలుస్తామని ఇరువురి అగ్ర నాయకులు అభయం ఇచ్చారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇరువురు నాయకులు ఇచ్చిన భరోసాపై సమావేశానికి హాజరైన సర్పంచులు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, డివిజన్స్ ఇన్చార్జీలు, పార్టీ ముఖ్య నాయకులు నూతన ఉత్సాహంతో సంతృప్తి వ్యక్తం చేశారు. రెట్టింపు ఉత్సాహంతో ఈ నాలుగు రోజులు అందరం కలిసి సమిష్టిగా పార్టీ అభ్యర్థుల భారీ విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నగర మేయర్ పోట్లూరు స్రవంతి జయవర్ధన్, మాజీ డీసీసీబీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడి రంగారెడ్డి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జూనియర్స్ సెలక్షన్ కమిటీ సభ్యులు మలిరెడ్డి కోటారెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, ఎంపిపి బూడిద విజయ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ కోటేశ్వర రెడ్డి, జిల్లా పార్టీ మహిళ అధ్యక్షురాలు మహిళ మొయిల్లా గౌరీ, జిల్లా యూత్ అధ్యక్షులు మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు మల్లు సుధాకర్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, రూరల్ నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed