
*నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవన స్రవంతికి ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డ్రైను కాలువల ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్న కమిషనర్ వై ఓ నందన్*
దిత్వా తుఫాను నేపథ్యంలో నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవన స్రవంతికి ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ సోమవారం వివిధ ప్రాంతాలలో డ్రైను కాలువల ప్రవాహాన్ని పర్యవేక్షించారు.
నగరంలోని ప్రధాన ప్రాంతాలైన గాంధీ బొమ్మ, వి.ఆర్.సి, రామలింగాపురం అండర్ బ్రిడ్జి తదితర ప్రదేశాల్లో కమిషనర్ అర్ధరాత్రి పర్యటించి డ్రైను కాలువల నిర్వహణ తీరును తనిఖీ చేశారు.
రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులతో కమిషనర్ మాట్లాడారు. భారీ వర్షాలకు వరద నీరు రోడ్లపై చేరకుండా అన్ని డ్రైను కాలువలలో క్రమం తప్పకుండా పూడికతీత పనులను చేపట్టాలని ఆదేశించారు.
ప్రణాళికాబద్ధంగా నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో డ్రైను కాలువల అడ్డంకులను గత కొంత కాలంగా క్రమం తప్పకుండా తొలగిస్తూ, ప్లాస్టిక్ వ్యర్ధాలు కాలువల్లో వేయకూడదు అనే అవగాహన ప్రజలకు కల్పించడంతో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సైతం వరద నీరు సాఫీగా ప్రవహించించేందుకు ఆస్కారం లభించిందని కమిషనర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.