
వ్యక్తిత్వ వికాస తరగతులను సద్వినియోగం చేసుకోండి
– కమిషనర్ వై.ఓ నందన్
నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 26, 27వ తేదీలలో స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులను వార్డు సచివాలయ కార్యదర్శులతో పాటు కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు.
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిక్షణ తరగతులలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ లర్నింగ్ స్కిల్స్, టీం స్పిరిట్, కెరియర్ గైడెన్స్ తదితర అంశాలపై శిక్షణ అందించనున్నారని తెలిపారు.
సక్సెస్ మంత్ర కార్యక్రమం ద్వారా రెండు రోజులపాటు నాలుగు షెడ్యూల్స్ లో ఉదయం 10.00 నుంచి 1:00 వరకు, మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్న ఈ శిక్షణ తరగతులకు వార్డు సచివాలయ కార్యదర్శులు హాజరై విధులలో ఉన్నత ప్రతిభ కనబరిచేందుకు ఉత్తమ అలవాట్లను శిక్షణ పొందాలని కమిషనర్ సూచించారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.