*కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట*

*విద్యా, వైద్యం రంగాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారిస్తాను : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.*

– కోవూరులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తా..
– ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు 24 గంటలు అందుబాటులో వుండాలి.
– ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఇనమడుగులో హాస్పిటల్ నిర్మాణానికి సిఎస్ఆర్ ఫండ్స్ అందచేసిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్.
– ప్రతి పేదవాడికి మెరుగైన వైద్య అందివ్వాలన్నది చంద్రబాబు నాయుడు తాపత్రయం.
– 18 నెలల కూటమి పాలనలో కోవూరు నియోజకవర్గంలో అనారోగ్య పీడితులకు దాదాపు 6 కోట్లు ఆర్ధిక సహాయం అందించాం.
– నిరు పేదల ఆరోగ్య భద్రత కోసం అతి త్వరలోనే “యూనివర్సల్ హెల్త్ పాలసీ”
– విద్యా, వైద్యం రంగాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారిస్తాను.
– కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

నిరు పేదల ఆరోగ్య భద్రత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు “యూనివర్సల్ హెల్త్ పాలసీ” అనే విన్నూత్న పధకానికి శ్రీకారం చుట్టబోతున్నారన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి ఆమె శంఖుస్థాపన చేస్సారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సందర్భంగా శిథిలావస్థకు చేరిన ఇనమడుగు పి హెచ్ సి గురించి స్థానిక నాయకులు తన దృష్టికి తెచ్చారని తాను ఎమ్మెల్యే కాగానే నియోజకవర్గంలో ప్రజలకు వైద్య సదుపాయాల గురించి తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిని సందర్శించానన్నారు. నూతన భవన నిర్మాణానికి సంబంధించి ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఎంపి గారు ప్రత్యేక చొరవ తీసుకొని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారి ద్వారా హాస్పిటల్ నిర్మాణానికి 1 కోటి 98 లక్షల సిఎస్ఆర్ ఫండ్స్ మంజూరు చేయించారన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో 24 గంటల డాక్టర్లు అందుబాటులో వుండేలా జిల్లా వైద్యాధికారులు ప్రత్యేక చొరవ చూపాలని వేదికపై వున్న జిల్లా వైద్యాధికారికి ఆమె విజ్ఞప్తి చేశారు.ప్రతి పేదవాడికి మెరుగైన వైద్య అందివ్వాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని 18 నెలల కూటమి పాలనలో కోవూరు నియోజకవర్గంలో అనారోగ్య పీడితులకు దాదాపు 6 కోట్లు ఆర్ధిక సహాయం అందించి ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేసారు.

కోవూరు నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం దిశగా తాను చేస్తున్న కృషిని ఆమె ప్రజలకు వివరించారు. విద్య, వైద్య రంగాలలో కోవూరు నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపాలన్నది తన సంకల్పమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. నిరు పేదల ఆరోగ్య భద్రత కోసం అతి త్వరలోనే “యూనివర్సల్ హెల్త్ పాలసీ” అనే పధకానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టబోతున్నారని దీని ద్వారా పేదలకు ఏడాదికి ఉచితంగా 25 లక్షల విలువ చేసే వైద్య సేవలు అందుబాటులోనికి రానున్నాయన్నారు. కోవూరు నియోజకవర్గంలో రైతులు సుభిక్షంగా వుండాలని ఆమె ఆకాంక్షించారు. ఇప్పటికే రైతులకు 2 విడతలుగా యూరియా పంపిణి చేపట్టామని 20 ఏళ్లుగా పూడికలు తీయని సాగునీటి కాలువలలో తన హయాంలో సిల్ట్ క్లియరెన్స్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఉగాది నాటికి పేదల ఇళ్ల పట్టాలు, పక్కా ఇళ్ల సమస్యలు పరిష్కరిస్తామని ఆమె ఈ సందర్భంగా హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, స్థానిక వైద్యాధికారి నిరంజన్, ఎంపీడీఓ శ్రీహరి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, వైస్ సర్పంచ్ చేజర్ల మహేష్, తెలుగుదేశం సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి, జెట్టి మదన్ రెడ్డి, నల్లపరెడ్డి సురేష్ రెడ్డి, స్థానిక నాయకులు తోట వెంకటేశ్వర్లు రెడ్డి చింతలపూడి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed