
*జన్మదినం సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వస్త్ర దానం*
తన పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ హైదరాబాద్ లోని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటులు నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో సిబ్బందికి వస్త్ర దానం చేశారు.
ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు బసవతారకం దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నిత్యం క్యాన్సర్ పేషంట్లకు అలుపెరగకుండా ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి వస్త్ర దానం చేసి తన సేవా నిరతి చాటుకున్నారు.
తన పుట్టినరోజు సందర్భంగా సిబ్బందికి వస్త్ర దానం చేయడం ఆనందంగా ఉందని వెల్లడించారు. హాస్పిటల్ లో పర్యటించి అందుతున్న సేవలను తెలుసున్నారు. ఎంతో ఉన్నత ఆశయంతో బాలకృష్ణ గారు ఈ హాస్పిటల్ ను తీర్చిదిద్దారని చెప్పారు.
అంతకుముందు జూబ్లీహిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. షిరిడి సాయినాధుని దర్శించుకుని వేద ఆశీర్వాదం తీసుకున్నారు.