*బుచ్చిరెడ్డి పాలెం, ఇందుకూరుపేటలో నేహారెడ్డి ప్రచారం*
బుచ్చిరెడ్డి పాలెం, మే 8,
వైఎస్సార్సీపీ యువనేత, పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి బుధవారం బుచ్చిరెడ్డి పాలెం పట్టణం అలాగే ఇందుకూరుపేట మండలంలోని సింతోపు, కొత్తూరు సింతోపు గ్రామాల్లో తల్లి సునంద రెడ్డి, స్థానిక నెతలతో కలిసి బుధవారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేహారెడ్డి ప్రచారానికి ప్రజలు నుంచి విశేష స్పందన లభించింది. ఘన స్వాగతం పలుకుతూ, ప్రచారంలో ఆమె వెంట ప్రజలు స్వచ్ఛందంగా నడిచారు. కోవూరు అభివృద్ధికి మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు వివరిస్తూ ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ, పొర్టీ నాయకులు మోర్ల మురళి, కోడూరు మధుసూదన్ రెడ్డితో కలిసి బుచ్చిరెడ్డి పొలెంలో పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ బుచ్చిరెడ్డి పాలెం నేతలు షేక్ చిన్నల్లా భిక్షు, కల్లు కిరణ్, చలపతి, పరిబాబు, చీర్ల ప్రసాద్, నగర పంచాయతీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు, జిల్లా పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు మొయిల్ల గౌరి, కర్తం జ్యోతి, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి వెంకటాచలం హిమబిందు, ఉపాధ్యక్షులు మాధవి వర్మ, పార్టీ మహిళా నేతలు బెందాళం పద్మావతి, పిల్లా సుజాత తదితరులు పాల్గొన్నారు.