
*స్మార్ట్ స్ట్రీట్ బజార్ దుకాణాలను అనుసంధానించేలా పాదచారుల మార్గం రూపొందించేందుకు ప్రణాళికలను సంసిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన కమిషనర్ వైఓనదన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక జాకీర్ హుస్సేన్ నగర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ బజార్ ప్రాజెక్ట్ ప్రాంగణాన్ని గురువారం టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు.
స్మార్ట్ స్ట్రీట్ బజార్ దుకాణాలను అనుసంధానించేలా పాదచారుల మార్గం రూపొందించేందుకు ప్రణాళికలను సంసిద్ధం చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ హిమబిందు, ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ అనిల్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చినబాబు, సిబ్బంది పాల్గొన్నారు.