*పొగాకు ఉత్పత్తుల నష్టాలను వివరించే గోడపత్రికను ఆవిష్కరించిన డాక్టర్ కనకాద్రి – డాక్టర్ మదన్మోహన్*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ రూపొందించిన పొగాకు ఉత్పత్తుల నష్టాలను వివరించే గోడ పత్రికను నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్మోహన్, కార్యాలయ సిబ్బంది సమక్షంలో బుధవారం ఆవిష్కరించారు.

కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో వైద్యులు మాట్లాడుతూ COTPA – Cigarettes and Other Tobacco Products Act (2003) భారత ప్రభుత్వ tobacco నియంత్రణ చట్టం ప్రకారంగా పబ్లిక్ ప్లేసెస్‌లో పొగ త్రాగడం నిషేధమని, 18 సంవత్సరాల లోపు వారికి సిగరెట్/టోబాకో ఉత్పత్తులను అమ్మడం నిషేధమని వివరించారు.

స్కూళ్లు, కాలేజీల 100 మీటర్ల పరిధిలో టోబాకో అమ్మడం నిషేధం అమలులో ఉందని, టోబాకో ప్యాకెట్ల మీద హెచ్చరికలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.

పొగాకు ఉత్పత్తులపై ప్రకటనలు, ప్రమోషన్లు, స్పాన్సర్‌షిప్స్‌కి పూర్తి నియంత్రణ ఉంటుందని వైద్యులు వివరించారు. ఇది ప్రజల ఆరోగ్యం రక్షించడానికి తీసుకున్న కఠిన చట్టమని వివరించారు.

ఈ కార్యక్రమంలో cotpa యాక్ట్ కో ఆర్డినేటర్ హాసిని, సిబ్బంది కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగర పాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed