
*శివపార్వతి కల్యాణోత్సవంలో పాల్గొన్న వేమిరెడ్డి దంపతులు*
– శివపార్వతీల కల్యాణ మహోత్సవంలో లాంటి ఆధ్యాత్మిక వేడుకకు నెల్లూరు వేదిక కావడం మనకు గర్వకారణం.
– టిటిడి ఛైర్మెన్ హోదాలో కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు బిఆర్ నాయుడు గారు చేస్తున్న సేవలు అమోఘం.
– ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
కార్తిక మాసం విశిష్టతను తెలియజేసేలా, హైందవ సమాజం హర్షించేలా నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం లో శివపార్వతుల కల్యాణ మహోత్సవవం కన్నుల పండువగా జరిగింది. టీవీ5, హైందవధర్మం ఛానెళ్ల సంయుక్త ఆధ్వర్యంలో టిటిడి ఆలయ పాలక మండలి ఛైర్మెన్ బి ఆర్ నాయుడు గారి సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కాశీ, కర్ణాటక రాష్ట్రంలోని దావనగెరె పట్టణాలలో నిర్వహించిన ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకకు నెల్లూరు వేదిక కావడం తెలుగువారందరికీ గర్వకారనం. విఆర్‌సీ మైదానం నుంచి వైభవంగా సాగిన శ్రీ శివ పార్వతుల శోభాయాత్రలో వేలాదిగా భక్తులను భాగస్వాములను చేసి నెల్లూరు నగరంలో భక్తుల శివ నామ స్మరణలు ప్రతిధ్వనించింది. వేమిరెడ్డి దంపతులు మాట్లాడుతూ బిఆర్ నాయుడు గారు 2013లో తొలిసారి హైదరాబాదులో శ్రీ శివ పార్వతుల కల్యాణం నిర్వహణకు అంకురార్పణ చేసి కార్తీక మాసం వచ్చిందంటే TV5, హిందూధర్మం ఛానళ్ళు నిర్వహించే శివపార్వతుల కళ్యాణం కోసం భక్తులు ఎదురు చూసేంతగా ఈ ధార్మిక కార్యక్రమం ప్రాచుర్యం పొందిందన్నారు. కనువిందు చేసేలా జరిగిన శ్రీ శివ పార్వతుల కల్యాణం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందాలని ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లు ఆకాంక్షించారు.