*లక్ష్యసాధనలో స్పీడ్ పెంచిన మంత్రి నారాయణ*
*నెల్లూరు నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో సుడిగాలి పర్యటన చేపట్టిన మంత్రి*
*ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న ఆధునీకరణ పనులు పరిశీలన*
*వి ఆర్ సి హై స్కూల్ మాదిరిగా సిటీలో మరో 15 పాఠశాలల రూపురేఖలు మార్పు చేస్తామన్న మంత్రి నారాయణ*

ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేదపిల్లల విద్యపై ప్రత్యేక ద్రుష్టి సాధించినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు స్పష్టం చేశారు. లక్ష్య సాధనలో స్పీడ్ పెంచిన మంత్రి P 4 ద్వారా వీఆర్సీ తరహాలో మరో పదిహేను హైస్కూల్స్ ని తీర్చిదిద్ధేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. నెల్లూరు నగరంలోని 45 వ డివిజన్ కర్ణాల మిట్ట MCHS, 6వ డివిజన్ YVM, 7వ డివిజన్ BVS, 9వ డివిజన్ MCHS, చిన్నబలయ్య నగర్ హైస్కూల్స్ ని మంత్రి నారాయణ సోమవారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. ఆధునీకరణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు భవనాల నిర్మాణం, ప్లే గ్రౌండ్ ఏర్పాటుకు డిజైన్లు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు మీడియాతో మాట్లాడుతూ గతప్రభుత్వం విద్యావ్యవస్థను అధోగతిపాలు చేసిందని ధ్వజమెత్తారు. స్కూల్స్ ని మూసేయటం తప్ప అభివృద్ధి చేయలేదన్నారు. నేను చదివిన వీఆర్, ఓరుగంటి రుక్మిణమ్మ స్కూల్స్ ని కూడా మూసేసారని మండిపడ్డారు. అయితే యువనేత లోకేష్ సహకారంతో ఇచ్చిన హామీ ప్రకారం వీఆర్సీ ని అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభించామన్నారు. అదే తరహాలో మరో పదిహేను హై స్కూల్స్ ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఒకటి నుంచి పదోతరగతి వరకు విద్యాబ్యాసం ఉండేలా చేస్తామన్నారు. వచ్చే ఏడాది జూన్ కల్లా అత్యున్నత ప్రమాణాలతో స్కూల్స్ సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ స్కూల్స్ లో చదివే పిల్లలకి నారాయణ కాంపిటీటివ్ మెటీరియల్ ఇస్తామని చెప్పారు. అలాగే నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ కూడా ఇవ్వమని నారాయణ విద్యాసంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డిని ఆదేశించామన్నారు. స్కూల్స్ దత్తతకు ముందుకొచ్చిన దాతలకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్ తో పాటు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *