
*సీఎం పాలనా దక్షతతో రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ*
– రెండు రోజుల్లోనే 613 ఒప్పందాలు, రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడుల సాధన
– 16 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు
– సీఐఐ సమ్మిట్ విజయవంతంతో ఏపీ వైపు ప్రపంచం చూపు
– జిల్లాలో ప్రఖ్యాత కంపెనీల పెట్టుబడులు
– నాడు గత పాలకుల నిర్లక్ష్యంతో పారిశ్రామిక తిరోగమనం
– నేడు పరిశ్రమల రాకతో రాష్ట్రం, జిల్లా సమగ్రాభివృద్ధి
– ప్రజల తరఫున సీఎం చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు
– ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలనా దక్షతతో సీఐఐ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు అన్నారు. విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సీఐఐ సమ్మిట్ విజయవంతం కావడంపై సోమవారం నెల్లూరులోని తమ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గార్ల కృషితో సీఐఐ సమావేశం ద్వారా సాధించిన ప్రగతిని, పెట్టుబడులను, జిల్లాకు వస్తున్న కంపెనీలు తదితరాలను వివరించారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.13,25,716 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ సహకారం, సీఎం చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్, మంత్రి నారా లోకేష్ గారు పెట్టుబడిదారులతో నిరంతరం జరిపిన సంప్రదింపులతో ఇది సాధ్యమైందన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో ఏపీ మళ్లీ దేశంలోనే నెంబర్ వన్ అవుతోందని చెప్పారు. ప్రభుత్వం తొలుత 8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తే అంతకుమించి 13.25 లక్షల కోట్లు రావడం గొప్ప విషయమన్నారు. వీటి ద్వారా దాదాపు 16 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. పేపర్లపై కాకుండా భూమిపై శంకుస్థాపనలు చేసి పూర్తి చేసేలా కంపెనీలను ఫాలోఅప్ చేసి ఏర్పాటు చేస్తున్న ఘనత ప్రభుత్వానికే దక్కుతుందని వివరించారు.
అలాగే జిల్లా స్థాయిలో 6,815 కోట్ల పెట్టుబడుల ద్వారా 4800 మందికి ఉద్యోగాలు రానున్నాయని వెల్లడించారు. జిల్లాలో జేఎం బాక్సీ గ్రూప్ సంస్థ 3 వేల కోట్లతో మెరైన్ సర్వీస్, లాజిస్టిక్, పోర్ట్ బేస్డ్ కంపెనీ ఏర్పాటు అవుతుందని చెప్పారు. దీని ద్వారా 3 వేల మందికి ఉద్యోగాలు రానాన్నుయని చెప్పారు. 2,200 కోట్లతో ఇండోసోల్ కంపెనీ ఏర్పాటు కానుండగా 500 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఐటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఆర్‌సీఆర్‌టీ 1615 కోట్లు పెట్టుబడులు పెట్టనుందని, దీని ద్వారా 1300 మంది ఉద్యోగాలు పొందుతారని వెల్లడించారు. త్వరలోనే గ్లాస్ తయారీ కంపెనీలు రాబోతున్నాయన్నారు. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం వదిలి వెళ్లిపోయిన పరిశ్రమలు ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్, లూలూ, బిఆర్ షెట్టి గ్రూప్ టైటాన్ వంటివి తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయంటే అది చంద్రబాబు గారి పాలనా నైపుణ్యమని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో ఉండేలా అభివృద్ధి చేయనున్నారని చెప్పారు.
మిగతా రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఉంటే.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు రాష్ట్రాన్ని తీసుకువెళుతున్నారని వివరించారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని, జిల్లాను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందరి భాగస్వామ్యంతో జిల్లాను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ.. గత 17 నెలలుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని, ఈ పెట్టుబడుల ప్రవాహాన్ని చూస్తుంటే ఇది సరికొత్త ఆంధ్రప్రదేశ్ అని నమ్మకం కలుగుతోందన్నారు. అనుభవం, అడ్మినిస్ట్రేషన్‌కు ఇది నిదర్శనమని చెప్పారు. పెట్టుబడులపై వైసీపీ నాయకులు లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అయినా కూడా పెట్టుబడిదారులు వెనక్కి తగ్గకుండా భారీగా తరలివచ్చారన్నారు. కేవలం ఒక ప్రాంతానికే ప్రాధాన్యం ఇవ్వకుండా మూడు ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ కంపెనీలను తీసుకువచ్చారని ఆమె స్పష్టం చేశారు. ఇంత భారీ స్పందన ఊహించలేదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు సాధించేందుకు చేరువలో ఉన్నామన్నారు. గత ప్రభుత్వం పేపర్‌పై పెట్టుబడులు చూపిస్తే.. కూటమి ప్రభుత్వం వాస్తవ పెట్టుబడులు చూపుతోందని అన్నారు.
ఇది మంచి ప్రభుత్వమని, పేదల ప్రభుత్వమన్నారు. అన్యాయం, అక్రమాలు లేకుండా పాలన సాగిస్తున్నారని చెప్పారు. రైతుల కోసం ఈ నెలలోనే రెండో విడత అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ యోజన నిధులు జమ కానున్నాయని చెప్పారు. అభివృద్ధిలో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. కోవూరు నియోజకవర్గంలో కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా పనిచేస్తున్నామన్నారు. నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ వీరేంద్ర నాయుడు, సాగునీటి సంఘ అధ్యక్షులు బత్తల హరికృష్ణ, టీడీపీ నాయకులు వంశీరెడ్డి, ఇందుకూరుపేట మండలపార్టీ అధ్యక్షులు పవన్‌కుమార్‌రెడ్డి, కే.వి శేషయ్య, శ్యాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.