
*పరిసరాల పరిశుభ్రత పై విద్యార్థులంతా అవగాహన పెంచుకోవాలని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చిన కమిషనర్ వై ఓ నందన్*
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న “స్వచ్ఛ్ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమం నిర్వహణలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ నేతృత్వంలో శనివారం స్థానిక వి.ఆర్ మున్సిపల్ పాఠశాల ప్రాంగణంలో “స్వచ్ఛతాహి సేవ” కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో ముందుగా కమిషనర్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు సిబ్బందితో “వ్యక్తిగత పరిశుభ్రత, సమాజ పరిశుభ్రతపై సమగ్ర అవగాహన” అంశంపై ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన కోసం స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులు విద్యార్థి దశ నుంచే చక్కటి అవగాహన పెంచుకొని ఆరోగ్యంగా ఎదగాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చేయడం మానుకోవాలని, పెద్దలకు కూడా బహిరంగ విసర్జనపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు కమిషనర్ సూచించారు. టాయిలెట్ వాడిన ప్రతిసారి చేతులను నీళ్లతో శుభ్రం చేసుకోవాలని, కాచి వడపోసిన నీటిని సేవించాలని తెలిపారు.
పరిసరాల పరిశుభ్రత పై విద్యార్థులంతా అవగాహన పెంచుకోవాలని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలో మొక్కలను నాటి సంరక్షించాలని, మొక్కల పెంపకాన్ని ఆదర్శంగా చేపట్టాలని కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో సెట్నెల్ సీఈవో నాగేశ్వరరావు, సిబ్బంది,వి.ఆర్. మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, వివిధ విభాగాల అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగర పాలక సంస్థ.