
*బి.పి.ఎస్ పథకం ద్వారా అనధికార నిర్మాణాలు, అనుమతులు అతిక్రమించిన నిర్మాణాలకు చట్టబద్ధత కల్పించేందుకు భవన యజమానులకు అవగాహన కల్పించి, పథకాన్ని సద్వినియోగం చేసుకొనేలా అవగాహన కల్పించాలని సూచించిన కమిషనర్ వై.ఓ నందన్*
నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ వారాంతపు సమీక్ష సమావేశంలో భాగంగా టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవన యజమానులు నిర్దేశించిన ప్లాను ప్రకారం కట్టుబడులు జరిగేలా సిబ్బంది అందరూ చర్యలు తీసుకోవాలని, అలాగే భవన నిర్మాణం జరుగు సందర్భంలో పిల్లర్ల దశలోనే అనుమతుల ఉల్లంఘనలను గుర్తించి తదుపరి చర్యలు తీసుకొన వలసిందిగా ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ ప్లానింగ్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడిగించిన ఎల్.ఆర్.ఎస్ పథకం గడువు లోపు అనధికార లేఅవుట్ల యజమానులు, ప్లాట్ల యజమానులు తమ ఆస్తులను క్రమబద్ధీకరించుకునేందుకు అవగాహన కల్పించాలని సూచించారు.
నక్ష ప్రాజెక్టును నిర్దేశించిన సమయంలోపు పూర్తయ్యేలా ప్రణాళిక బద్దంగా అన్ని విభాగాల వార్డు సచివాల కార్యదర్శులను సమన్వయం చేసుకుంటూ పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు.
బి.పి.ఎస్ పథకం ద్వారా అనధికార నిర్మాణాలు, అనుమతులు అతిక్రమించిన నిర్మాణాలకు చట్టబద్ధత కల్పించేందుకు భవన యజమానులకు అవగాహన కల్పించి, పథకాన్ని సద్వినియోగం చేసుకొనేలా అవగాహన కల్పించాలని సూచించారు.
నగరపాలక సంస్థకు ఆదాయ వనరులు పెరిగేలా, అలాగే అనుమతుల ప్రకారం నిర్మాణం జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రతిరోజు కమిషనర్ నిర్వహించే క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్ సందర్భంగా అవకతవకలను గుర్తించిన సందర్భంలో సంబంధిత సిబ్బంది పై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
టౌన్ ప్లానింగ్ సమీక్ష సమావేశంలో సిటీ ప్లానర్ హిమబిందు, డిప్యూటీ సిటీ ప్లానర్ రఘునాథ రావు, ఏసీపీలు, టీపీబివోలు, వార్డు సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.