*”ర్యాలీలు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు” -కాకాణి* *జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజా ఉద్యమ ర్యాలీలు నెల్లూరు జిల్లాలో కూడా విజయవంతమయ్యాయి : వైయస్సార్సీపి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి*

*”ర్యాలీలు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు” -కాకాణి*

*జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజా ఉద్యమ ర్యాలీలు నెల్లూరు జిల్లాలో కూడా విజయవంతమయ్యాయి : వైయస్సార్సీపి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి*

 

*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:13-11-2025*

*నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో, ర్యాలీలు విజయవంతం కావడానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

*స్క్రోలింగ్ పాయింట్స్:*

– జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజా ఉద్యమ ర్యాలీలు నెల్లూరు జిల్లాలో కూడా విజయవంతమయ్యాయి.

– వైయస్సార్సీపీ ప్రజా ఉద్యమం ర్యాలీలలో ప్రజలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, విద్యావంతులు ర్యాలీలలో భారీగా పాల్గొని తమ మద్దతునిచ్చారు.

– జగన్మోహన్ రెడ్డి గారి తెచ్చిన మెడికల్ కళాశాలను చంద్రబాబు దుర్మార్గంగా, పిపిపి పద్ధతిలో స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేటీకరణ చేస్తూ, ప్రజల సొమ్మును ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు.

– చంద్రబాబు వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు.

– కూటమి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి పెట్టిన ఆంక్షలు, వేధింపులు, అణచివేత ధోరణిని కూడా లెక్కచేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

– చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరసన తెలియజేసే హక్కును కాలరాసే విధంగా పాలనను కొనసాగిస్తున్నాడు.

– చంద్రబాబు ఇష్టారాజ్యంగా వ్యవహరించినా, ప్రజలు, ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదనే ధోరణితో పనిచేస్తున్నాడు.

– బ్యారికేడ్లు పెట్టి నిలువరించాలని ప్రయత్నించినా, అనేక ఆంక్షలు పెట్టినా, కేసులు పెడతామని పోలీసులు భయపెట్టినా, ప్రజలు ప్రజా ఉద్యమ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది.

– ప్రజా ఉద్యమం ర్యాలీలో అంబటి రాంబాబుపై పోలీసుల వైఖరిని ఖండిస్తున్నా.

– రెచ్చగొట్టి, కవ్వింపు చర్యలకు దిగడం, కేసులు పెట్టడం కోసమే అంబటి రాంబాబుపై పోలీసుల దురుసు ప్రవర్తన.

– మాజీ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబును సీఐ స్థాయి అధికారి దుర్భాషలాడటం, హేయంగా మాట్లాడటం చంద్రబాబు ప్రభుత్వపు దిగజారుడు వ్యవస్థకు నిదర్శనం.

– ప్రజా ఉద్యమం ర్యాలీ విజయవంతం కాకూడదని చంద్రబాబు పోలీసులను ఉపయోగించి ఎక్కడికి అక్కడ హౌస్ అరెస్టులు, లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి ప్రయత్నించారు.

– తాడిపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచడం, కూటమి ప్రభుత్వపు అరాచక చర్యలకు పరాకాష్ట.

– ప్రజల నిరసనలకు పోటాపోటీగా అధికార పార్టీ నాయకులు కార్యక్రమాలు పెట్టి ప్రజా ఉద్యమాన్ని ఆపేందుకు చూశారు.

– చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై కక్ష సాధింపులు జరుగుతున్నాయి.

– నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో తోటపల్లి గూడూరు మండలం, డక్కిలివారిపాళెం గ్రామంలో దళిత కుటుంబం ఒక పూట తిని, ఒక పూట తినకుండా కట్టుకున్న ఇంటిని నిట్టనిలువునా కూల్చివేశారు.

– గ్రామ కంఠం భూములు అనుభవంలో ఉన్నవారు అనుభవించవచ్చునని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా, గ్రామ కార్యదర్శికి కూల్చే అధికారం లేకున్నా, వందలాది పోలీసులను మోహరించి ఒక పేద దళిత కుటుంబం కట్టుకున్న ఇంటిని కూల్చడానికి మనసు ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదు.

– ప్రశ్నించిన అమాయక గిరిజనుల ఇంటిపైకి వెళ్లి, గొంతులు కోస్తున్న అరాచక పాలనను నేడు ప్రజలు చూస్తున్నారు.

– ఇవే చివరి అవకాశంగా భావించి, కూటమినేతలు ప్రజలను అన్యాయంగా అణగతొక్కుతూ, దొరికిందల్లా దోచుకుంటున్నారు.

– ప్రభుత్వ, ప్రైవేటు భూములతో పాటు, దేవాలయ భూములను కూడా కూటమినేతలు విడిచిపెట్టడం లేదు.

– వెంకటాచలం మండలం, కాకుటూరు గ్రామంలోని శివాలయానికి చెందిన భూమి కూటమి పాలనలో దోపిడీకి గురైంది.

– పొదలకూరులో ప్రైవేటు వ్యక్తుల భూములలో తెలుగుదేశం నాయకులు టేకు చెట్లు నరికేశారు.

– ఉదయగిరి నియోజకవర్గంలో అగ్రిగోల్డ్ భూములలో యూకలిప్టస్ చెట్లను నరికి, అమ్ముకున్నారు.

– పంటపాళెం వద్ద పామాయిల్ యూనియన్ల పేరిట పామాయిల్ ట్యాంకర్ల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు.

– తెలుగుదేశం పార్టీకి చెందిన వారే మీడియా సమావేశాలలో ఎమ్మెల్యే అడిగిన డబ్బు కట్టకపోతే కాళ్లు ఇరుగ్గొడుతానని బెదిరిస్తున్నారని మాట్లాడుతున్నారు.

– బూడిద తరలించే బంకర్ల నుండి 300/- రూపాయల చొప్పున కూటమినేతలు దారి దోపిడీ చేస్తున్నారు.

– సర్వేపల్లి నియోజకవర్గానికి పరిశ్రమలు, వ్యాపారస్తులు రావాలంటే, తెలుగుదేశం నాయకుల దారి దోపిడీలకు భయపడుతున్నారు.

– కాంట్రాక్టు పనుల కోసం జెన్కో లాంటి ప్రభుత్వ సంస్థలపై దాడులు చేయిస్తున్నారు.

– రాష్ట్రంలో కూటమిపాలనలో ఎన్ని దారుణాలు జరుగుతున్నా, అధికారానికి తలొగ్గి పోలీసులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు.

– ప్రజలు చంద్రబాబు దుర్మార్గపు పాలనను, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనను బేరీజు వేసుకొని, తమ నిరసనను వెళ్లగక్కుతున్నారు.

– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటూ, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు.

– జగన్మోహన్ రెడ్డి గారి పాలనను ప్రజలు తిరిగి కోరుకుంటున్నారు.

– తెలుగుదేశం పార్టీ నాయకులు ఓడిపోయిన తర్వాత ప్రజల్లో కనిపించిన దాఖలాలు లేవు.

– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల కోసం పోరాటాలు చేస్తూ, ప్రజల మన్ననలు పొందుతున్నారు.

– ఉమ్మడి నెల్లూరు జిల్లా, కందుకూరు నియోజకవర్గంతో సహా, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రజల నుండి దాదాపు 10 లక్షల సంతకాలు సేకరిస్తున్నాం.

– ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలు, కందుకూరు నియోజకవర్గంతో సహా 11 నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇంచార్జీల ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఉద్యమ ర్యాలీలు విజయవంతం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed