
*తరచుగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్న ప్రాంతాలలో అందుకు గల కారణాలను నిశితంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించిన నగర కమీషనర్ వై ఓ నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక ఆత్మకూరు బస్టాండు ప్రాంతంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పనులను గురువారం చేపట్టారు.
వాహనాలు ప్రయాణించే మార్గంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం, ఇంజనీరింగ్ విభాగం, ఆర్ & బి శాఖ, ట్రాఫిక్ పోలీసు శాఖ, నేషనల్ హైవే అథారిటీ అధికారులను కమిషనర్ ఆదేశించారు.
తరచుగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్న ప్రాంతాలలో అందుకు గల కారణాలను నిశితంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రోడ్ల ఆక్రమణ, నిషేధిత స్థలాల్లో వాహనాల పార్కింగ్, వాహనాల మార్గంలో తోపుడుబండ్లు, ఇతర దుకాణాల ఏర్పాటు, బస్టాండ్ ప్రధాన మార్గం వద్ద ఆటోల నిలుపుదల తదితర సమస్యలపై దృష్టి సారించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.