ఇమామ్, మౌజన్ ల గౌరవ వేతనాల కోసం రూ.90 కోట్లు మంజూరు.

రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించింది.

చంద్రబాబు దూరదృష్టి, సమానత్వ నిబద్ధత వల్లే ముస్లింల అభివృద్ధి జరుగుతుంది

 ముస్లింలపై చంద్రబాబు చూపిన చిత్తశుద్ధికి ముస్లిం సమాజం కృతజ్ఞతలు తెలియజేస్తుంది.

– మంత్రి ఫరూక్ కు ప్రత్యేక ధన్యవాదాలు

– ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్.

రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించిందని ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో తొంభై కోట్లు విడుదల చేస్తూ, ఇమామ్, మౌజన్ లకు నెలకు రూ.15,000 చొప్పున గౌరవ వేతనాలు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం 2024 ఏప్రిల్, మే, జూన్ నెలలతోపాటు 2025 జనవరి నుండి సెప్టెంబర్ వరకు గౌరవ వేతనాలు మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. సమాజంలో సద్భావన, ఆధ్యాత్మిక, విలువలను నిలబెట్టడానికి కృషి చేస్తున్న రాష్ట్రంలోని వేలాది ఇమామ్‌లు, మౌజన్ లకు ఇది ఎంతో ఉపశమనం కలిగించే చర్యగా ఆయన అభివర్ణించారు. మైనార్టీలపై చిత్తశుద్ధి చూపిన చంద్రబాబు నాయుడుకు ముస్లిం సమాజం కృతజ్ఞతలు తెలియజేస్తుందని అన్నారు. అలాగే, ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ప్రతి అర్హుడి చేతికి సకాలంలో చేరేలా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నారని, సమాజ అభివృద్ధి కోసం ప్రతి సామాజిక వర్గాన్ని సమానంగా చూసే నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. చంద్రబాబు దూర దృష్టి పరిపాలన నైపుణ్యం సమానత్వ నిబద్ధత వల్లే మైనారిటీల అభివృద్ధి జరుగుతుందని మైనారిటీల పథకాలు కొత్త దిశగా సాగుతున్నాయని అన్నారు. మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఇమామ్, మౌజ్జిన్ మన ప్రభుత్వం పట్ల విశ్వాసంతో ముందుకు సాగాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed