*నూతనంగా నిర్మిస్తున్న భవనానికి సంబంధించి నిర్మాణ అనుమతులను తనిఖీ చేసిన కమిషనర్ వై ఓ నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 17 వ డివిజన్ ప్రాంతంలో బుధవారం పర్యటించారు.
డివిజన్ పరిధిలోని పినాకిని రెవెన్యూ లేఔట్ ను కమిషనర్ పరిశీలించారు. సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న భవనానికి సంబంధించి నిర్మాణ అనుమతులను తనిఖీ చేశారు.
స్థానికంగా ఉన్న మెగా డ్రైను కాలువను కమిషనర్ పరిశీలించి, కాలువలో పూడికతీత పనులను శానిటేషన్ విభాగం సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ అనిల్ కుమార్, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.