*ఎల్.ఆర్.ఎస్. బి.పి.ఎస్. లేఅవుట్సు గురించి స్థానిక ఎల్టిపీలు బిల్డర్లు కు అవగాహన, సందేహాల నివృత్తి కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి, కమిషనర్ వైఓ నందన్*

నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కమీషనర్ వై.ఓ. నందన్ ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక విభాగం వారితో సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఎల్.ఆర్.ఎస్. బి.పి.ఎస్. లేఅవుట్సు గురించి స్థానిక ఎల్టిపీలు బిల్డర్లు కు అవగాహన, సందేహాల నివృత్తి కార్యక్రమం చేపట్టారు. ఎల్.ఆర్.ఎస్. బి.పి.ఎస్. లేఅవుట్సు వాటి గురించి ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలనీ, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలి తద్వారా పట్టణం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర పురపాలక శాఖామాత్యులు డాక్టర్. పొంగూరు నారాయణ ఆలోచనలతో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎల్.ఆర్.ఎస్. బి.పి.ఎస్. ద్వారా కార్పొరేషన్ కు ఆదాయం చేకూరేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే కొంతమంది బిల్డర్లు లైసెన్సులు టెక్నికల్ పర్సన్స్ సందేహాలకు కమీషనర్ వై.ఓ.నందన్ సమాధానాల ద్వారా నివృతి చేశారు.

ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సిటీ ప్లానర్ హిమబిందు డిప్యూటీ సిటీ ప్లానర్ రఘునాధ రావు లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ బిల్డర్లు టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed