
*నెల్లూరు జైల్లో *మాజీ మంత్రి జోగి రమేష్* ఎమ్మెల్సీ *తలశిల రఘురాం*తో కలిసి, పరామర్శించిన.. ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
—————————–
నెల్లూరు సెంట్రల్ జైల్లో *మాజీ మంత్రి జోగి రమేష్* గారిని ఎమ్మెల్సీ *తలశిల రఘురాం*
గారితో కలిసి, వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ *పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు ములఖత్ అయ్యారు.
ఈ సందర్బంగా *జోగి రమేష్ గారిని కలిసి..పలు విషయాలు మాట్లాడారు.*
ఈ సందర్బంగా *కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు.. ఆ పార్టీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.*
ఈ సందర్బంగా *చంద్రశేఖర్ రెడ్డి* గారు మాట్లాడుతూ..
• కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తూ.. నియంతృత్వ ధోరణిలో.. వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
• వైఎస్ఆర్సిపి నాయకులపై అక్రమ కేసులు బనాయించి.. వారిని జైల్లో పెట్టి నిర్బంధిస్తున్న తీరు చూస్తుంటే.. కూటమి ప్రభుత్వం ఒక నియంతృత్వ పాలన సాగిస్తూ.. పైశాచిక ఆనందం పొందుతుందన్న విషయం ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు.
• మొదట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నుంచి.. మొన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి అరెస్టు వరకు.. ఎలాంటి సంబంధం లేని కేసులు వైసీపీ నేతలపై బనాయించి వారిని అక్రమంగా జైల్లో పెట్టి.. ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందన్నారు.
• ఈరోజు జోగి రమేష్ గారిని..కూడ సంబంధం లేని కేసులో అరెస్టు చేసి.. జైల్లో పెట్టి నిర్బంధించారని మండిపడ్డారు.
• కూటమి ప్రభుత్వంలో చీప్ లిక్కర్ అక్రమంగా తయారు చేసి బాటిల్ పది రూపాయలకు అమ్మడాని జోగి రమేష్ ప్రశ్నించినందుకు.. ఆయనపై అదే అక్రమ కేసు బనాయించడం అత్యంత జుపుక్సాకమన్నారు.
• ఆరోజు స్కిల్ కేసులో చంద్రబాబునాయుడిని అన్ని ఆధారాలు ఉండి అరెస్టు చేస్తే.. ఒక తండ్రిని అరెస్టు చేస్తే ఆ బిడ్డ బాధ ఎలా ఉంటుందని..లోకేష్, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు గుర్తున్నాయన్నారు.
• ఈరోజు ఎలాంటి సంబంధం లేని కేసులో జోగి రమేష్ గారి పేరు..చేర్చి అక్రమంగా అరెస్ట్ చేస్తే.. ఆ కుటుంబం ఎంత.. మానసిక వేదన అనుభవిస్తుందో.. వీరికి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
• ఇంతఅరాచక పాలన ఎక్కడా చూడలేదన్నారు.
• ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు,అన్యాయాలను.. ప్రశ్నించేందుకు.. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసన తెలియజేయడం.. ఆ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు.
• ఇదే వ్యవహార శైలితో.. కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తే.. ప్రజలే ఆ పార్టీ నేతలకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.