
*”సర్వేపల్లి నియోజకవర్గంలో భారీ ర్యాలీ.. హోరెత్తిన జన సందోహం”*
*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:12-11-2025*
*సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచల మండల కేంద్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ, మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి కాకాణి పూజిత గారి ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు, పౌరహక్కుల సంఘాల నాయకులు, మేధావులు, విద్యావేత్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు, ప్రజలతో కలిసి వైయస్సార్సీపీ ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ*
*వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో జనసంద్రంగా మారిన వెంకటాచలం మండల కేంద్రం.*
*ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి, ఎక్కడికక్కడ జనాలను రానివ్వకుండా రోడ్లకు అడ్డంగా బ్యారికేడ్లు నిర్మించినా, బ్యారికేడ్లను తోసివేసి, స్వచ్ఛందంగా తరలి వచ్చిన జనం.*
*పోలీసుల బెదిరింపులు ఆంక్షలను సైతం లెక్కచేయకుండా, ర్యాలీలో పోటేత్తిన జనం.*
*వెంకటాచలం మండల కేంద్రంలో తహశీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించిన నేతలు.*
*వేలాదిగా తరలివచ్చి, ర్యాలీని విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, శ్రీమతి కాకాణి పూజితమ్మ.*