*45/2 రామ్మూర్తి నగర్ వార్డు సచివాలయ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శి టి. శోభన మరియు  27/3 లక్ష్మీ సాయి నగర్ వార్డ్ సచివాలయ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శి ఎన్. ధనుంజయ్ లను సస్పెండ్ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్*

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు స్థానిక 45/2 రామ్మూర్తి నగర్ వార్డు సచివాలయ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శి టి. శోభన విధులలో నిర్లక్ష్యం వహించిన విషయమై జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సంతృప్తికరమైన వివరణ ఇవ్వని కారణంగా విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను శనివారం జారీ చేశారు.

పరిపాలనా సాలభ్యం దృష్ట్యా 45/1 జేమ్స్ గార్డెన్ సచివాలయ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శిని ఇన్చార్జిగా నియమించారు.

అదేవిధంగా స్థానిక 27/3 లక్ష్మీ సాయి నగర్ వార్డ్ సచివాలయ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శి ఎన్. ధనుంజయ్ ట్రేడ్ లైసెన్స్ నిధుల ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడిన విషయమై జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సంతృప్తికరమైన వివరణ ఇవ్వని కారణంగా విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

పరిపాలన సౌలభ్యం దృష్ట్యా 27/2 ఓల్డ్ గిరిజన కాలనీ వార్డు సచివాలయ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శిని ఇన్చార్జిగా నియమించారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కమిషనర్ మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్స్ నిధుల దుర్వినియోగానికి ఎవరైనా వార్డు సచివాలయ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ కార్యదర్శులు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *